thirumavalavan
-
ప్లాన్ ప్రకారమే దాడి చేశారు- తమిళనాడు ఎంపీ
-
మా పార్టీ తరపున సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు: తమిళనాడు ఎంపీ
సాక్షి, హైదరాబాద్: పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి రావడం గొప్ప పరిణామని ప్రముఖ దళిత నేత, ఎంపీ, ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ అధినేత తిరుమావళన్ వ్యాఖ్యానించారు. మిగిలిన రాజకీయ నేతలతో పోలిస్తే కేసీఆర్ ప్రత్యేకతలు కలిగి ఉన్న నాయకుడని అన్నారు. దేశ ప్రజల కోసం బీఆర్ఎస్ అవసరం ఉందన్నారు. వీసీకే పార్టీ తరపున కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, అంతకుముందు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కర్ణాటకలో బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో ప్రభావం చూపాలని ఆకాంక్షించారు. చదవండి: (KCR Party: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు) -
సీఎం కేసీఆర్ పై దళిత నేత, తిరుమావళవన్ ప్రశంసలు
-
ప్రణయ్ చట్టం కోసం పోరాడుతాం
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : ప్రణయ్ చట్టాన్ని తీసుకువచ్చేంత వరకూ పోరాడుతామని మాజీ ఎంపీ, విముక్తి చిరుతల కక్షి జాతీయ అధ్యక్షుడు తిరుమావలవన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ప్రణయ్ కుటుం బానికి 50వేల రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా ప్రణయ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించి పెళ్లి చే సుకున్నందుకు హత్య చేయడం సరైంది కాదన్నారు. ప్రణయ్ కుటుం బా నికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆ యన వెంట కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు, మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, హరిజనవాడల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, మేడి కొండ విజయ్ తదితరులున్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అమృత మిర్యాలగూడ అర్బన్ : హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిని బుధవారం రాత్రి ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ సదానాగరాజును కలిశారు. ప్రణయ్ పోస్టుమార్టం రిపోర్టును ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు ఫేస్బుక్, వాట్సాప్‌లలో అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యుల గురించి వస్తున్న అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఫిర్యాదు చేస్తే ఫేస్బుక్, వాట్సాప్‌లలో అలాంటి పోస్టులు పెట్టేవారిని గుర్తిస్తామని సీఐ చెప్పడంతో త్వరలోనే ఫిర్యాదు అందచేస్తామని తెలిపినట్లు సమాచారం. ప్రణయ్‌కు సంబంధించిన డెత్ సర్టిఫికట్ కోసమే పోస్టుమార్టం రిపోర్టు కావాలని కోరినట్లు సీఐ తెలిపారు. (మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ) చదవండి: అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! -
అఖిలపక్షం చిచ్చు
సాక్షి, చెన్నై: డీఎంకే అఖిలపక్షం పిలుపు మక్కల్ ఇయక్కంలో చిచ్చు రగిల్చేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఆ ఇయక్కంలో చోటు చేసుకుంటున్నాయి. అఖిల పక్షానికి దూరం అని ఎండీఎంకే నేత, ఇయక్కం కన్వీనర్ వైగో ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇక, సీపీఎం, సీపీఐలు సైతం పునరాలోచించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రం ప్రభుత్వం అఖిలపక్షానికి స్పందించని దృష్ట్యా, కావేరి హక్కుల సాధనకు డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వ్యతిరేకంగా బీజేపీ విమర్శలు గుప్పించే పనిలో పడగా, ఇదో ఉప ఎన్నికల స్టంట్ అని అన్నాడీఎంకే ప్రకటించింది. పీఎంకే నేత రాందాసు ఆచీతూచీ అడుగులు వేయడానికి నిర్ణయించగా, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్ లో మౌనంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇక, కాంగ్రెస్, మనిద నేయ మక్కల్‌కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలు కొన్ని ఇప్పటికే మద్దతు ఇచ్చి ఉన్నాయి. ఇక, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కూడిన మక్కల్ ఇయక్కం ఆ సమావేశానికి దూరం అని కన్వీనర్ వైగో ప్రకటించారు. అయితే, వైగో ప్రకటన ఆ కూటమిలో చిచ్చు రగిల్చేందుకు ఆస్కారాలు కన్పిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆదివారం ఆ ఇయక్కంలోని వీసీకే నేత తిరుమావళవన్ స్పందించడం గమనార్హం. తిరుమా ఎటో : కావేరి వివాదం అన్నది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన సమస్య కాదు అని, ఇది అందరి సమస్య, దీని సాధనకు అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ, తిరుమావళవన్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో, అఖిల పక్షం బాధ్యతల్ని ప్రధాన ప్రతిపక్షం స్వీకరించాలని తాను గతంలో డిమాండ్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎవరు ఎలా వెళ్లినా, తాను పట్టించుకోనని, అయితే, అందరి సమస్య కాబట్టి, అఖిలపక్షం విషయంగా సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ మేరకు పార్టీ వర్గాలతో సమాలోచనకు తిరుమావళవన్ పిలుపు నిచ్చారు.ఆ సమావేశం మేరకు తదుపరి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాగా, అందరి సమస్య కాబట్టి, డీఎంకే పిలుపునకు ఆయన స్పందించవచ్చన్న భావన బయలు దేరింది. ఇక, ఇదేఇయక్కంలో ఉన్న సీపీఎం, సీపీఐలు పునరాలోచనలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. పునరాలోచన : కావేరి హక్కుల సాధన కోసం ఆది నుంచి ఉద్యమిస్తున్న రైతు సంఘాల్లో అత్యధికం వామపక్షాలకు అనుబంధంగా ఉన్నవే. సీపీఎం, సీపీఐ గొడుగు నీడన ఉన్న రైతు సంఘాలు కావేరి హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, వారికి మద్దతుగా డీఎంకే గళం విప్పింది. అలాగే, రైతు సంఘాల అఖిల పక్ష సమావేశానికి డీఎంకే ప్రతినిధులు హాజరయ్యారు. ఇక, ఉద్యమాల్లో , ఆందోళనల్లో స్వయంగా ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ సైతం పాల్గొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అదే నినాదంతో డీఎంకే అఖిల పక్ష సమావేశానికి పిలుపు నివ్వడం సీపీఎం, సీపీఐ వర్గాలను ఇరకాటంలో పడేసినట్టు సమాచారం. మక్కల్ ఇయక్కం డీఎంకేకు వ్యతిరేకంగా సాగుతున్న ఓ కూటమిగా పరిగణించవచ్చు. అయితే, రైతు సమస్యల విషయంలో డీఎంకే కలిసి వస్తున్న నేపథ్యంలో, తాము మాత్రం దూరంగా ఉంటే, ఏదేని విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా..? అన్న పరిశీలనలో సీపీఎం, సీపీఐ వర్గాలు పడ్డాయి. తమ అనుబంధ రైతు సంఘాలు డిఎంకే అఖిలపక్షానికి హాజరై, తాము హాజరు కాకుంటే, అన్నదాతల వ్యతిరేకతకు గురి కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వైగో నిర్ణయాన్ని పునస్సమీక్షించే పనిలో పడ్డట్టు సమాచారం. అయితే, ఇయక్కం కన్వీనర్‌గా ఉన్న వైగో ప్రకటించి ఉన్న నిర్ణయాన్ని వీసీకే, సీపీఎం, సీపీఐలు ధిక్కరించిన పక్షంలో చిచ్చు ఆ ఇయక్కంలో రగిలినట్టే. కాగా, డీఎంకే అఖిల పక్ష సమావేశాన్ని ఈనెల 25న కాకుండా, మరో తేదీలో నిర్వహించి ఉండాల్సిందని ఓ వామపక్షవాది వ్యాఖ్యానించారు. ఈనెల 26వ తేదీ నుంచి ఉప ఎన్నికల నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టనుండడం, ఆ ముందు రోజు అఖిలపక్షం పేరుతో అందరూ ఒకే చోట చేరిన పక్షంలో రాజకీయంగా ఇరకాటంలో పడాల్సి వస్తుందేమో అన్న ఆందోళన తమ నేతల్ని వెంటాడుతున్నట్టుగా ఆ వామపక్ష నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. -
రూ. 25 లక్షలిచ్చి హత్య చేయించా
నిందితుడి సంచలన వాంగ్మూలం చెన్నై: వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి హత్య కేసులో అరెస్టయిన ముఖ్య నిందితుడు జగన్నాథన్ బుధవారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి వెట్రిసెల్వన్ మే 20వ తేదీన మూవరసంపట్టు అనే ప్రాంతంలో స్థలం తగాదా గురించి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీని గురించి మడిపాక్కం డెప్యూటీ కమిషనర్ లక్ష్మినారాయణన్, ఇన్స్పెక్టర్ ధనరాజ్ కేసు నమోదు చేసి 28వ తేదీన కిరాయి ముఠాకు చెందిన పెరుమాళ్, వినోద్, మోహన్, సతీష్, ప్రభులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ముఖ్య నిందితుడైన జగన్నాథన్ కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తూ వచ్చింది. అయితే జగన్నాథన్ తన లాయర్ ద్వారా మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. హత్య పూర్వపరాల గురించి జగన్నాథన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కానాత్తూరులోగల రూ.10 కోట్ల విలువైన భూమికి సంబంధించి తనకు వెట్రిసెల్వన్‌కు తగాదా ఏర్పడిందని, ఆ సమయంలో తనను హత్య చేస్తానని వెట్రిసెల్వన్ బెదిరించాడు... దీంతో భయపడిన తాను ముందుగానే అతన్ని హతమార్చేందుకు పథకం రూపొందించానన్నారు. ఆ క్రమంలో అతడిని హత్య చేసేందుకు రూ. 25 లక్షలతో కిరాయి ముఠాతో బేరం కుదుర్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆ ముఠా వెట్రిసెల్వన్‌ను హతమార్చిందన్నారు.