
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం మర్డర్. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు మొత్తం దేశంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు వర్మ. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు.(చదవండి : ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్)
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన వర్మ.. తాజాగా ఓ పాటను విడుదల చేశారు. పిల్లల్ని ప్రేమించడం తప్పా అటూ సాగే ఈ పాటను స్వయంగా వర్మనే ఆలపించాడు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం హైదరాబాద్లో రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. . దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment