ఆర్జీవీ ‘వ్యూహం ’ తొలి పాట వచ్చేసింది | Vyooham Movie First Song Out | Sakshi
Sakshi News home page

ఆర్జీవీ ‘వ్యూహం ’ తొలి పాట వచ్చేసింది

Published Sat, Sep 2 2023 6:37 PM | Last Updated on Sat, Sep 2 2023 7:33 PM

Vyooham Movie First Song Out - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాటని విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చూపించాడు. 

‘నరకాసుల నవ్వులు.. రాబంధవుల హేళనలు..జగనుడి మౌనం.. రాక్షసుల నాట్యం... వెన్నుపోటుల రాజులు.. వెంటనడిచే కుక్కలు.. బురద జల్లే బండ్రోతులు.. బెదిరించే నక్కలు.. అన్నింటిని తదదన్నే జగనుడి నిశ్శబ్ధం.. అంటూ సాగే ఈ ఒక్క పాటతో అప్పట్లో తెర వెనుక జరిగిన రాజకీయాలేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు ఆర్జీవీ. ఇక పాట చివరల్లో చంద్రబాబు పాత్రదారితో అతని భార్య ‘ఏంటండీ ఆ జనం.. మా నాన్న వెంట కానీ, వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది రావడం నేను చూడలేదు’అని అనగా.. ‘జనానికి పిచ్చి బాగా ముదిరింది’ అంటూ చంద్రబాబు పాత్రధారి అనడం వీడియోలో గమనించవచ్చు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement