
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతంపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ లాంటి యువ కథానాయకులు ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా మేసేజ్ చేశారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ దారుణ ఘటనపై స‍్పందించారు. ‘పరువు కోసం ప్రాణం తీసిన ఘటన ఎంతో బాధ కలిగించింది. మనిషి ప్రాణం తీయటంలో పరువు ఎక్కడుంది..? సమాజం ఎటు పోతుంది..?
ప్రణయ్ కుటుంబ సభ్యులకు, అమృత వర్షిణికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ప్రణయ్‌కి న్యాయం జరగాలి’ అంటూ తన ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. ఈ సంఘటనపై చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించారు. చరణ్ కామెంట్‌ను పోస్ట్ చేసిన ఉపాసన మన ఎటూ పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Sad times. Where r we going. #lovehasnoboundaries #justiceforpranay #RamCharan pic.twitter.com/2C4iVRgsTW
— Upasana Kamineni (@upasanakonidela) 18 September 2018