మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలపై గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్ కోసం రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు బెయిల్ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
పీడీ యాక్టు కేసులో బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురు ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖ లు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులు వరంగల్ జైలుకు చేరిన తరువాత ఆ ముగ్గురు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment