
సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు లో మొత్తం 7 గురు నిందితులు ఉన్నారని ఎస్పీ రంగనాథ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్యకు సంబంధించి మొత్తం కోటి రూపాయల డీల్ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 18 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు తెలిపాడు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసున్నారని వివరించారు. దీనిలో భాగమైన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరితో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తామని అన్నారు. నల్గొండ కి చెందిన మాజీ ఐసిస్ టెర్రరిస్ట్ లు ప్రణయ్ హత్య కేసు లో ఇన్వాల్వ్ అయ్యారని, ప్రణయ్‌ను చంపిన వాడు బీహార్‌కు చెందినవాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment