
సాక్షి, మిర్యాలగూడ: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతని భార్య అమృతను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్‌రావుపై బుధవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో తన తండ్రి మారుతీరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఇద్దరు వ్యక్తులు అమృతను బెదిరించడంతోపాటు తండ్రి ఆస్తులు దక్కుతాయని ప్రలోభపెట్టారు.
ఈ విషయంపై అమృత ఫిర్యాదు మేరకు గత నెల 30వ తేదిన ప్రణయ్ హత్యలో ప్రధాన సూత్రధారులు తిరునగరు మారుతీరావు, ఎంఎ.ఖరీంలతో పాటు వెంకటేశ్వర్‌రావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విష యం విదితమే. మారుతీరావు సలహా మేరకు అమృతను కలిసేందుకు వెంటేశ్వర్‌రావుతోపా టు రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్‌రావు ఉన్నట్లుగా ఆలస్యంగా గుర్తించిన పోలీసులు నాలుగో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, వెంకటేశ్వర్‌రావుపై కేసు నమోదనైట్లు తెలుసుకున్న భాస్కర్‌రావు తనపై కూడా కేసు అవుతుందని భావించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న భాస్కర్‌రావును త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment