రెచ్చిపోయిన కౌన్సిలర్‌.. గ్యాంగ్‌తో కలిసి యువకులపై దాడి | Congress Councilor Attacks On Youth At Miryalaguda | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో: రెచ్చిపోయిన కౌన్సిలర్‌.. గ్యాంగ్‌తో కలిసి యువకులపై దాడి

Published Wed, Jun 1 2022 10:30 AM | Last Updated on Thu, Jun 2 2022 8:34 AM

Congress Councilor Attacks On Youth At Miryalaguda - Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లాలోని షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. కౌన్సిలర్ జానీ అండ్ గ్యాంగ్ ముగ్గురు యువకులను చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. స్థానిక వెంకటేశ‍్వర థియేటరలో సినిమా చూసేందుకు కౌన్సిలర్‌ జానీ బంధువులు వెళ్లారు. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా సినిమా చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమయంలో జానీ బంధువు, సదరు యువకుల(నాగరాజు, సతీష్, సాయితేజ) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఈ విషయాన్ని ఆ వ్యక్తి.. కౌన్సిలర్‌ జానీకి తెలియజేశాడు. 

తన బంధువుతోనే గొడవకు దిగాతారా అంటూ.. జానీ తన గ్యాంగ్‌(20మందితో)ని తీసుకొని థియేటర్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ చేశాడు. జానీతో పాటు గ్యాంగ్‌ కలిసి.. ముగ్గురు యువకులపై దాడి చేశాడు. వారి దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 

ఇది కూడా చదవండి: సినిమా థియేటర్‌కు యువతులు.. ఓ వ్యక్తి ఫోటోలు తీసి అసభ్యకరంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement