counceler
-
ఆప్ ఎన్నికల వ్యూహం.. ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది(2025) ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెలువరించిన అభ్యర్థుల రెండో జాబితాలో పార్టీ వ్యూహం వెల్లడయ్యింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యిఆప్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాతవారికి తిరిగి టిక్కెట్లు దక్కలేదు. పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు కేటాయించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాన్ల స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో అంత్యంత ఆసక్తికరంగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థులు, కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలకు మించిన రీతిలో ఆప్ వారిపై నమ్మకం వ్యక్తం చేసింది.విమర్శలకు చెక్ పెడుతూ..పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలపై ఓటర్లకు ఉన్న ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం ఇచ్చిన కారణంగా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను విమర్శించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడను ఆప్ ప్లే చేసింది. ఈసారి ఎన్నికలు అంత సులువు కాదని వ్యూహకర్తలు కూడా భావిస్తున్నారట. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందంటున్నారు.ప్రజాభిప్రాయ సేకరణఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆప్ తమ అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిందని సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసిన చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై మూడు స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మిగిలిన 20 సీట్లలో రాఖీ బిర్లాన్, మనీష్ సిసోడియాల సీట్లు కూడా మారాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టిక్కెట్లు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలోకి దించింది. వీరిలో 90 శాతం మంది ఆప్ కౌన్సిలర్లు కావడం విశేషం. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రజాదరణ పొందిన కౌన్సిలర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది.ఈ కౌన్సిలర్లకు ఆప్ టిక్కెట్లునరేలా నుంచి దినేష్ భరద్వాజ్, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, జనక్‌పురి నుంచి ప్రవీణ్ కుమార్, డియోలి నుంచి ప్రేమ్ కుమార్ చౌహాన్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్ని, త్రిలోక్‌పురి నుంచి అంజనా పర్చా (మాజీ కౌన్సిలర్)కు ఆప్ టిక్కెట్లు కేటాయించింది. ఇదేవిధంగా త2020లో ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ టిక్కెట్లు కేటాయించింది. ఈ జాబితాలో రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్, గాంధీ నగర్ నుంచి నవీన్ చౌదరి ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.ఇది కూడా చదవండి: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత -
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్‌కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం
-
రెచ్చిపోయిన కౌన్సిలర్.. గ్యాంగ్‌తో కలిసి యువకులపై దాడి
సాక్షి, నల్లగొండ: జిల్లాలోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. కౌన్సిలర్ జానీ అండ్ గ్యాంగ్ ముగ్గురు యువకులను చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. స్థానిక వెంకటేశ్వర థియేటరలో సినిమా చూసేందుకు కౌన్సిలర్ జానీ బంధువులు వెళ్లారు. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా సినిమా చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమయంలో జానీ బంధువు, సదరు యువకుల(నాగరాజు, సతీష్, సాయితేజ) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఈ విషయాన్ని ఆ వ్యక్తి.. కౌన్సిలర్ జానీకి తెలియజేశాడు. తన బంధువుతోనే గొడవకు దిగాతారా అంటూ.. జానీ తన గ్యాంగ్(20మందితో)ని తీసుకొని థియేటర్ దగ్గరకు వచ్చి హల్చల్ చేశాడు. జానీతో పాటు గ్యాంగ్ కలిసి.. ముగ్గురు యువకులపై దాడి చేశాడు. వారి దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది కూడా చదవండి: సినిమా థియేటర్‌కు యువతులు.. ఓ వ్యక్తి ఫోటోలు తీసి అసభ్యకరంగా.. -
కౌన్సిలర్ దంపతులపై టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం
కత్తులతో బెదిరించిన యూత్ విభాగం ఫర్నిచర్, కంప్యూటర్ ధ్వంసం పార్టీకి రాజీనామా చేయకుంటే చంపుతామని బెదిరింపు సిరిసిల్ల టౌన్ : సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్ దంపతులపై టీఆర్ఎస్ యూత్ విభాగం కార్యకర్తలు తెగబడ్డారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి ఇంటిపై దాడిచేసి.. కౌన్సిలర్ భర్తను దూషించారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. 27వ వార్డు కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి భర్త సుదర్శన్ వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష కోసం పద్మశాలి అనుబంధ సంఘాల జేఏసీ చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నాడు. పద్మశాలి నేతలు ప్రతిరోజూ అంబేద్కర్ చౌరస్తాలో రిలేదీక్షలు చేపడుతున్నారు. మంగళవారం సిరిసిల్లకు వచ్చిన మాజీ ఎంపీ పొన్నం, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వచ్చి దీక్షకు మద్దతు పలికారు. రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సుదర్శన్ ఆయన వాహనంపైకి చేరి జిల్లా ఆకాంక్షను వెలిబుచ్చారు. దీంతో రెచ్చిపోయిన టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్, మహమూద్, బాబి, వేముల గంగాధర్ మరో 20 మంది కౌన్సిలర్ ఇంటికి చేరుకుని దాడిచేశారు. పార్టీకి రాజీనామా చేయాలంటూ కత్తులతో బెదిరిస్తూ.. ఇంట్లోని అద్దాలు, కంప్యూటర్ను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్‌కే వ్యతిరేకంగా పనిచేస్తావా..? చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలి తమపై జరిగిన దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ దంపతులు కోరారు. పద్మశాలి కులస్తుల ఆకాంక్ష మేరకు తాను జిల్లా కావాలని కోరుతున్నామని, మంత్రికి, పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. దాడికి పాల్పడిన వారితో తమకు ప్రాణహాని ఉందని, వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న అఖిలపక్షం నేతలు వచ్చి కౌన్సిలర్ దంపతులను ఓదార్చారు.