సాక్షి, నల్గొండ : మిర్యాలగూడ పట్టణంలోని గణేశ్ నగర్‌లో మహిళా దొంగలు హల్‌చల్ చేశారు. చైనా మార్కెట్ షాపునకు వెళ్లి.. అందులో ఉన్న వస్తువులను దొంగలించారు. అనంతరం ఏమీ తెలియనట్టుగా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. అయితే వాళ్లు వెళ్లిపోయిన తర్వాత షాపులో కలియదిరిగిన యజమానికి వస్తువులు లేకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో సీసీటీవీ పరిశీలించగా వారు షాపులోని వస్తువులను దొంగిలించిన దృశ్యాలు కనిపించాయి. ఈ మేరకు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment