Women thieves
-
చైనా షాపులో మహిళా దొంగల హల్చల్
-
మహిళా దొంగల హల్చల్
సాక్షి, నల్గొండ : మిర్యాలగూడ పట్టణంలోని గణేశ్ నగర్లో మహిళా దొంగలు హల్చల్ చేశారు. చైనా మార్కెట్ షాపునకు వెళ్లి.. అందులో ఉన్న వస్తువులను దొంగలించారు. అనంతరం ఏమీ తెలియనట్టుగా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. అయితే వాళ్లు వెళ్లిపోయిన తర్వాత షాపులో కలియదిరిగిన యజమానికి వస్తువులు లేకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో సీసీటీవీ పరిశీలించగా వారు షాపులోని వస్తువులను దొంగిలించిన దృశ్యాలు కనిపించాయి. ఈ మేరకు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాటలు కలిపి.. మాయ చేస్తారు!
సాక్షి, బోధన్: ఆర్టీసీ బస్టాండ్లలో దుండగులు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రయాణికులను గమనించి ప్రణాళిక ప్రకారం నగదు, ఆభరణాలను దోచుకుంటున్నారు. నవీపేట, నిజామాబాద్‌లలో ఇటీవల జరిగిన రెండు వరుస సంఘటనలతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి జంకుతున్నారు. నవీపేటలోని బస్టాండ్‌లో పది మంది మహిళా ముఠా సభ్యులు పథకం ప్రకారం చోరీలు చేస్తున్నారు. గల్లీల్లో పూసలు(మహిళల అలకంరణ కోసం) అమ్ముకుంటామని ఇంటికి తిరిగి వెళ్తున్నామని, బస్సు కోసం చూస్తున్నామని తోటి ప్రయాణికులను నమ్మించారు. బస్సెక్కే సమయంలో ఓ ప్రయాణికురాలి చేతిలో ఉన్న బ్యాగును కొట్టేసేందుకు ప్రయత్నించగా సదరు మహిళ ప్రతిఘటించింది. ఆ బ్యాగులో రూ.3 లక్షల నగదు ఉండడంతో ఊపిరి పీల్చుకున్న సదరు ప్రయాణికురాలు హడావుడిగా నిజామాబాద్‌కు వెళ్లిపోయింది. తమ పని కాలేదని భావించిన మహిళా దుండగులు ముఠా సభ్యులు మరో ప్రయాణికుడి కోసం గాలం వేశారు. బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ అనే వ్యక్తి రూ.48 వేల నగదుతో బస్టాండ్‌కు వచ్చాడు. అతడితో మాటలు కలిపిన మహిళలు నగదుతో ఉన్న బ్యాగును ఎత్తుకుని ఆటోలో పారిపోయారు. ఈ ముఠాలోని కొందరు సభ్యులను స్థానికులు పట్టుకున్నారు. ఎనిమిది మంది మహిళా ముఠా సభ్యులను పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీలపై విచారిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ప్రభుత్వ టీచర్ స్రవంతి దగ్గర 13 తులాల బంగారు ఆభరణాలను కొట్టేశారు. బస్సు దిగే సమయంలో ఒకరినొకరు తోపుకుంటూ ఆత్రుతగా దిగే ప్రయత్నంలో దొంగలు సునాయసంగా బ్యాగులో ఉన్న బంగారాన్ని అపహరించారు. రాకపోకలను గమనించి మాటేస్తారు.. బస్టాండ్లలో చోరీలకు ఈజీగా ఉంటుందని కొందరు మహిళా ముఠా సభ్యులు బస్టాండ్లను అనువుగా ఎంచుకున్నారు. గ్రామాల్లోని గల్లీలో తిరుగుతూ వ్యాపారాలు చేసే మహిళలు పనిలో పనిగా మహిళల రాకపోకలను గమనిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అని మాటలు కలుపుతున్నారు. నవీపేటకు చెందిన మహిళ చీటీ డబ్బులను తీసుకుని వెళ్తుండగా గమనించిన ముఠా మహిళలే పథకం ప్రకారం చోరీకి యత్నించి విఫలమయ్యారు. గ్రామాల్లో ఇలాంటి వ్యాపారాలు చేసే మహిళల రాకపోకలు ఎక్కువవుతున్నాయి. అల్యూమీనియం వంట పాత్రల విక్రయాలు, జిప్పుల మరమ్మతులు, పిల్లలు ఆడుకునే బుగ్గలను అమ్మే మహిళల్లో కొందరు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారు. బస్సు ఎక్కి, దిగే సమయంలోనే.. ముఠా సభ్యులు ప్రయాణికులు రద్దీగా ఉండే సమయంలోనే చోరీలు చేస్తున్నారు. బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సెక్కే సమయంలో తమ వద్ద ఉన్న వస్తువులపై తాత్కాలిక నియంత్రణ కోల్పోతారు. ఆత్రుతలో ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారే గానీ చోరీ తంతులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ లోపాలను ఆసరాగా చేసుకున్న దుండగులు అవలీలగా చోరీలు చేస్తున్నారు. నవీపేట, నిజామాబాద్ బస్టాండ్లలో చోరీలు ఇలాగే జరిగాయి. విచారిస్తున్న పోలీసులు నవీపేటలో ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా నిందితులు(ఫైల్) నవీపేట బస్టాండ్‌లో చోరీకి పాల్పడి హల్చల్ చేసిన పది మంది మహిళా ముఠాలోంచి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీపుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడా చోరీలు పాల్పడ్డారు, ఎంత మంది ముఠాలో ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఎనిమిది మందిలోంచి ఆటోలో పారిపోయిన మరో ఇద్దరి వివరాలు కోసం పోలీసులు విచారిస్తున్నారు. బస్టాండ్‌లోనే చోరీలు జరగడంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్టాండ్లలోనే తరచూ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటివారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్సు ఎక్కే, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. –శ్రీనాథ్‌రెడ్డి, అర్బన్ టౌన్ సీఐ, నిజామాబాద్ -
మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త
సాక్షి, పెరవలి(పశ్చిమగోదావరి) : తణుకు పరిసర ప్రాంతాల్లో చైన్ స్కాచింగ్ చేసే 30 మంది మహిళా దొంగలు ఉన్నారని, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని, వారు కనబడితే సమాచారం ఇవ్వాలని కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెరవలి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం వచ్చిన ఆయన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా దొంగలు రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ఎక్కి మహిళల మెడలో ఉండే వస్తువులను ఎంతో చాకచక్యంగా దొంగిలిస్తారని తెలిపారు. అదే నిర్మానుష ప్రాంతాలైతే దాడులకు కూడా తెగబడతారని హెచ్చరించారు. నగలు వేసుకుని ఒంటరిగా వెళ్లవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, వాహనదారులు కూడా సహకరించాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి గ్రామం వద్ద స్పీడ్ కంట్రోల్ చేసే స్టాపర్లు ఏర్పాటు చేశామని దీనివల్ల ప్రమాదాలు తగ్గాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, లేనిపక్షంలో జరిమానా తప్పదని, దీనివల్ల ప్రయాణికులకే భద్రత ఉంటుందన్నారు. పెరవలి పోలీస్‌స్టేషన్ రికార్డుల నిర్వహణ బాగుందని, సిబ్బంది పనితీరు కూడా బాగానే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వైబీ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
మాయా లేడీల ఆటకట్టు
అడ్డగుట్ట: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి బ్యాగుల చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో గత కొంత కాలంగా వరుస బ్యాగు చోరీలు జరుగుతున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సోమవారం ప్లాట్‌ఫాం నం.1లోని బుకింగ్ ఎంట్రెన్స్ గేట్ వద్ద ప్రయాణికుల బ్యాగుల చోరీకి పాల్పడుతున్న నలుగురు మహిళలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్నాటక రాష్ట్రం, బద్రావతికి చెందిన బోయ దుర్గమ్మ, బర్రె శారద, జ్యోతి, బడిగ భాగ్యలుగా గుర్తించినట్లు తెలిపారు. గార్మెంట్స్ కంపెనీలో పని చేస్తున్న వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనే యోచనతో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి బ్యాగుల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 14.50 లక్షల విలువైన 45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. అపరిచితుల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దని రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సమావేశంలో రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్ఐ ప్రమోద్ కుమార్, రాజ్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
కి‘లేడీ’లు
బద్వేలు అర్బన్: మహిళలను ఏమార్చి చాకచక్యంగా చోరీలకు పాల్పడే ఇద్దరు మహిళలను గురువారం బద్వేలు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.50 లక్షలు విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రెడ్డప్ప నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 న అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామానికి చెందిన అయ్యవారమ్మ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం తన బ్యాగులోని పర్సును తీసి డబ్బులు చెల్లించే క్రమంలో...అందులో నగలు ఉన్నట్లు గుర్తించిన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గోగోల దానమ్మ, ఆత్మకూరు టౌన్ మేదర వీధికి చెందిన ఇరగాదిన్ల సరోజమ్మ లు అయ్యవారమ్మను అనుసరించారు. బస్టాండ్ సమీపంలోని పూల అంగళ్ల వద్ద పూలు కొనుగోలు చేసే సమయంలో ఆ ఇద్దరు మహిళలు తమ పైటను కట్టెల బ్యాగు పై వేసి ఎవరికీ అనుమానం రాకుండా అందులోని నగలతో ఉడాయించారు. ఇంతలో పూలకు డబ్బులు ఇచ్చేందుకు పర్సు చూసుకోగా పర్సు కనిపించక పోవడంతో వెంటనే అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టించిన సీసీ కెమెరా మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించగా అందులో ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించి సిద్దవటం రోడ్డులోని మరికొన్ని సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను పరిశీలించారు. వారు పోరుమామిళ్ల వైపు వెళ్ళినట్లు నిర్ధారించుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో పోరుమామిళ్లలోని కొమరోలు–మైదుకూరు ప్రధాన రహదారి పై ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్బన్ ఎస్ఐ చలపతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ హేమాద్రి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగలను పట్టించిన సీసీ కెమెరా పుటేజీ
పెబ్బేరు (కొత్తకోట): పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ నెల 10న బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి నుంచి 5 తులాల బంగారం చోరీ చేసిన మహిళలను సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా గుర్తించారు. వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బాధితురాలు చంద్రకళ పెబ్బేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్టాండ్‌లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో శుక్రవారం పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో వనపర్తికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరి మహిళలను అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు మార్కండేయరెడ్డి గుర్తించారు. సీసీ టీవీ పుటేజీలో ధరించిన చీరలే ఉండడంతో ఆ మహిళలు బంగారు చోరీ చేసిన వారిగా నిర్ధారించుకుని ఆర్టీసీ డ్రైవర్ సాయంతో బస్సును పోలీసుస్టేషన్ వద్ద నిలిపి అదుపులోకి తీసుకున్నారు. వీరిని కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్, ఎస్ఐ ఓడీ రమేష్‌లు విచారించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బీచుపల్లి ఆంజనేయస్వామ ఆలయంలో భక్తుల కాటేజీలో గదిని అద్దెకు తీసుకుని రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. బీచుపల్లి వద్ద ఉన్న గది తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లను నిఘా పెట్టగా మరో తాళం చెవితో శనివారం గది తెరిచేందుకు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను కొత్తకోట సీఐ కార్యాలయానికి తరలించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. -
మహిళలు అనారోగ్యానికి గురైనట్టు నటించి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా దొంగలు హడలెత్తిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్లల్లో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాదిలో కేంద్ర పారిశ్రామిక భద్రత సిబ్బంది (సీఐఎస్ఎఫ్) 532 మంది మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. 10 నుంచి 12 వరకు మహిళా గ్యాంగులు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. రద్దీగా ఉన్న మెట్రో రైళ్లల్లో మహిళా దొంగలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్టు నటిస్తారు. ప్రయాణికులు సాయం చేసేందుకు వెళితే మహిళా దొంగలు వారి నుంచి డబ్బు, విలువైన వస్తువులను కాజేస్తారు. మెట్రో రైళ్లల్లో ప్రతి రోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో మహిళా దొంగలే ఎక్కువని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 246 కేసులు నమోదయ్యాయని, అయితే చాలా సందర్భాల్లో బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయరని చెప్పారు. ఆరు లేదా ఏడుగురు మహిళా దొంగలు రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వీరు ఓ వ్యక్తి చుట్టూ చేరి ఒకరు అనారోగ్యానికి గురైనట్టు నటిస్తారని, సాయం చేయమని కొందరు అతన్ని కోరుతారని, ఈ క్రమంలో ఇతర మహిళలు డబ్బు, విలువైన వస్తులను దొంగిలిస్తారని చెప్పారు. -
మహిళా దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్ : రైళ్లు, బస్సుల్లో దొంగతనాలకు పాల్పడే ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఇట్టా కష్ణవేణి, కొల్లుపల్లి మరియమ్మ, మరొక మహిళను అనంతపురంలో సీసీఎస్, తాడిపత్రి పోలీసులు బుధవారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలోని ఓ బస్సులో దొంగిలించిన వస్తువులను విక్రయించేందుకు వచ్చిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెల్లడయ్యాయన్నారు. మహిళా దొంగల నుంచి రూ. 95 విలువ జేసే బంగారు నగలను స్వాదీనం చేసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. -
దొంగతనానికి యత్నించి దొరికి పోయారు
వేసవి ఉక్కపోత భరించలేక ఆరు బయట చల్లగాలికి పడుకున్న మహిళలపై ఇద్దరు మహిళలు దోపిడీకి తెగబడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతుప్రాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న నలుగురు మహిళల నుంచి నాలుగు తులాల బంగారు, 40 తులాల వెండి, రూ.20వేల నగదును ఇద్దరు గుర్తు తెలియని మహిళలు చోరీ చేశారు. అంతటితో ఆగక మరో ఇంట్లోకి ప్రవేశించగా వారు మేల్కొని కేకలతో అందరినీ నిద్రలేపారు. అందరూ కలిసి ఒక మహిళను సొత్తుతో సహా పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు ఆమెను అప్పగించారు. మరో మహిళ పరారైంది. -
మాయ లే‘డీలు’
ఆభరణం కొన్న అరగంటకే తస్కరణ ఆటోలో ప్రయాణిస్తూనే బ్యాగులో పర్సు కాజేసిన వైనం రూ.96వేల విలువైన 4.5 సవర్ల బంగారు ఆభరణం మాయం బంగారు ఆభరణాలు అమ్మే షాపులే లక్ష్యంగా ఒంగోలు : ఒంగోలు నగరంలో ముగ్గురు మహిళలు ‘మాయ లేడీ’లుగా మారారు. సహచర ప్రయాణికుల మాదిరిగా ఉంటూ మహిళల బ్యాగుల్లో పర్సులు మాయం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సోమవారం ఒంగోలు నగరంలో అదే జరిగింది . ఓ మహిళ బంగారు నగలు అమ్మే కార్పొరేట్ మాల్లో ఖరీదైన బంగారు హారం కొనుగోలు చేసి ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడే కాజేశారు. కొన్న అరగంటకే తస్కరించారంటే ఆరితేరినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మార్కాపురంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న డి.సునీత పుట్టిల్ల అయిన సూరారెడ్డిపాలెం వచ్చింది. పండుగ శెలవులు కావటంతోపాటు పండుగను ఆనందంగా జరుపుకునేందుకు బంగారు నగలు కొనుగోలు చేయాలని సునీత కుటుంబం భావించింది. అందులో భాగంగా తన తండ్రి బాల కోటయ్యతో కలిసి సూరారెడ్డిపాలెం నుంచి ఒంగోలుకు వచ్చింది. బస్టాండ్ సమీపంలోని ఖజానా జ్యూయలరీలో మధ్యాహ్నం రూ.96 వేల విలువైన 4.5 సవర్ల బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసింది. ఆ బంగారు ఆభరణం ఉన్న బాక్సును ఒక పర్సులో ఉంచి దాన్ని తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. జ్యూయలరీ షాపు నుంచి తన తండ్రితో కలిసి నడుచుకుంటూ ఆర్టీసి బస్టాండ్ సెంటర్ వరకు వచ్చారు. అక్కడ సూరారెడ్డిపాలెం వెళ్ళేందుకు ఆటో ఎక్కారు. షాపు దగ్గర నుంచి తండ్రి, కూతుర్ల వెంటే ముగ్గురు మహిళలు అనుసరించి బైపాస్ వరకు వస్తామంటూ వీరితోపాటు అదే ఆటో ఎక్కారు. వెనుక సీట్లో సునీతతోపాటు తండ్రి బాలకోటయ్యలు కూర్చున్నారు. ముగ్గురు మహిళల్లో ఒకరు నడుముకు ఆపరేషన్ చేయించుకుందని, బాలకోటయ్యను ఆటో డ్రైవర్ సీటులోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేసింది. సరేనంటూ బాలకోటయ్య డ్రైవర్ పక్క సీటులోకి వెళ్ళాడు. ఒకరికొకరు సరదాగా మాట్లాడుతూ ఒకరిపై ఒకరు తోసుకుంటూ నవ్వులాటలకు దిగారు. ముందుగానే ఆటో కిరాయి ఇచ్చేశారు. ఆటో నెల్లూరు బస్టాండ్ సెంటర్ దాటి యాక్సిస్ బ్యాంక్ ఎదురుకు వచ్చే సరికి అర్జంటుగా పని ఉందంటూ ముగ్గురు మహిళలు దిగేశారు. ఆటో కొంచెం ముందుకు వెళ్ళేసరికి సునీత తన బ్యాగును చూసుకుంది. ఆ బ్యాగు జిప్ తీసి ఉండడంతో బ్యాగులోని పర్సు చూసుకోగా అందులోని పర్సు మాయమైందని గుర్తించి ఆటోను వెనక్కు తిప్ప పరిసర ప్రాంతాల్లో వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. వెంటనే ఆ సమాచారం ఒంగోలు టూటౌన్ బ్లూకోట్స్ సిబ్బందికి అందించారు. బ్లూ కోట్స్ సిబ్బంది రామకృష్ణ(ఆర్కె), వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి సమాచారాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు చేరవేశారు. ఆ మాయలేడీల కోసం నగరంలో వెతుకులాట ప్రారంభించినా ఫలితం కనిపించలేదు. ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.