వేసవి ఉక్కపోత భరించలేక ఆరు బయట చల్లగాలికి పడుకున్న మహిళలపై ఇద్దరు మహిళలు దోపిడీకి తెగబడ్డారు.
వేసవి ఉక్కపోత భరించలేక ఆరు బయట చల్లగాలికి పడుకున్న మహిళలపై ఇద్దరు మహిళలు దోపిడీకి తెగబడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతుప్రాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న నలుగురు మహిళల నుంచి నాలుగు తులాల బంగారు, 40 తులాల వెండి, రూ.20వేల నగదును ఇద్దరు గుర్తు తెలియని మహిళలు చోరీ చేశారు. అంతటితో ఆగక మరో ఇంట్లోకి ప్రవేశించగా వారు మేల్కొని కేకలతో అందరినీ నిద్రలేపారు. అందరూ కలిసి ఒక మహిళను సొత్తుతో సహా పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు ఆమెను అప్పగించారు. మరో మహిళ పరారైంది.