బోడుప్పల్‌లోని కళింగ వైన్స్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.
బోడుప్పల్‌లోని కళింగ వైన్స్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం దుకాణం తెరిచిన తర్వాత దొంగతనం జరిగిన విషయాన్ని యజమాని గుర్తించాడు. దుకాణం వెనుక నుంచి కన్నం చేసుకుని ప్రవేశించిన దుండగులు క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.50వేల నగదుతోపాటు మూడు కార్టన్ల మద్యాన్ని ఎత్తుకుపోయారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.