మహిళా దొంగల అరెస్ట్‌ | women thieves arrest | Sakshi
Sakshi News home page

మహిళా దొంగల అరెస్ట్‌

Published Wed, Oct 26 2016 11:11 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

women thieves arrest

అనంతపురం సెంట్రల్‌ : రైళ్లు, బస్సుల్లో దొంగతనాలకు పాల్పడే ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఇట్టా కష్ణవేణి, కొల్లుపల్లి మరియమ్మ, మరొక మహిళను అనంతపురంలో సీసీఎస్, తాడిపత్రి పోలీసులు బుధవారం సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలోని ఓ బస్సులో దొంగిలించిన వస్తువులను విక్రయించేందుకు వచ్చిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెల్లడయ్యాయన్నారు. మహిళా దొంగల నుంచి రూ. 95 విలువ జేసే బంగారు నగలను స్వాదీనం చేసుకున్నట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement