మురిసిన మువ్వన్నెల జెండా
నంద్యాల: స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ నంద్యాలలో 350అడుగుల పొడవు ఉన్న జాతీయ జెండాను ప్రదర్శించారు. బడ్డింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సంస్థ, గురురాజ విద్యాసంస్థలు సంయుక్తగా ఈ భారీ జెండాను రూపొందించాయి. సంజీవనగర్ జంక్షన్, శ్రీనివాస సెంటర్, గాంధీచౌక్ ప్రాంతాల్లో జెండాను విద్యార్థులు ప్రదర్శిస్తుంటే స్థానికులు ఆసక్తిగా తిలకించారు.