indipendence
-
నా తండ్రి ధైర్యాన్ని చూస్తే గర్వంగా ఉంది - ఆనంద్ మహీంద్రా
దాదాపు 75 ఏళ్ల పాటు రహస్య సమచారంగా ఉన్నటువంటి ఓ విషయాన్ని ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. స్వాతంత్రానికి పూర్వం బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని దుయ్యబడుతూ తన తండ్రి రాసిన వివరాలను ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా తెలిపారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కి చెందిన ప్రముఖ పాఠశాల ఫ్లెచర్. ఇటీవల ఈ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆనంద్ మహీంద్రాకి ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా గతంలో ఆనంద్ మహీంద్రా తండ్రి ఈ పాఠశాలలో చదివినప్పుడు (1945) తన భవిష్యత్తు లక్ష్యాలను వివరిస్తూ స్కూల్ యాజమాన్యానికి రాత పూర్వకంగా తెలిపిన అభిప్రాయాలను ఆనంద్ మహీంద్రాకు అప్పగించింది. ఆ లేఖలో విషయాలను చూసిన ఆనంద్ మహీంద్రా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఫ్లెచర్ స్కూల్ యజమాన్యానికి రాసిన లేఖలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద విదేశాంగ విధానం దాని పర్యవసానంగా భారత్‌కి జరుగుతున్న నష్టాలను ఆనంద్ మహీంద్రా తండ్రి అందులో సోదాహారంగా వివరించారు. ఇండియాకు ఇప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానం లేదంటూ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా వాస్తవాలను విశ్లేషించారు. భవిష్యత్తులో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రయోజనాలు లక్ష్యంగా స్వతంత్ర ఫారిన్ పాలసీ ఇండియాకి అవసరం అంటూ ఆనంద్ మహీంద్రా తండ్రి స్పష్టం చేశారు. అందువల్లే తాను ఫారిన్ సర్వీస్‌ను ఎంపిక చేసుకుంటానని తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో తెలిపారు. తన లాంటి మరెందరికో అంతర్జాతీయ వ్యవహారాల్లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ తెలిపారు. స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ రాజ్‌లో జీవిస్తూ.. అప్పటి తెల్లదొరల దమననీతిని ఎండ గడుతూ తన తండ్రి చూపిన తెగువను ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మన తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వారితో ఎక్కువగా మాట్లాడుతూ.. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటూ నేటి యువతకు ఆయన సూచించారు. When I was at the @FletcherSchool to deliver the Class Day Address, they very graciously gave me copies of my father’s application to Fletcher in 1945. These documents are mandatorily confidential for 75 years & by a wonderful coincidence, were declassified just last year! (1/2) pic.twitter.com/oOfYfR43ZV — anand mahindra (@anandmahindra) June 4, 2022 చదవండి: హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్ మహీంద్రా ఆగ్రహం! -
ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా ‘75 ఏళ్ల ఉత్సవాలు’
న్యూఢిల్లీ: స్వాతం త్య్రం సిద్ధించి వచ్చే ఏడాదికి 75 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో అసాధ్యమనుకున్న కొన్ని లక్ష్యాలను సు సాధ్యం చేసేందుకు దేశం కొన్ని సాహ సోపేత నిర్ణయాలు తీసుకోనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యమే కేంద్రంగా 75 ఏళ్ల ఉత్సవాలు సాగాలని ఆయన నొక్కి చెప్పారు. ‘75 ఏళ్ల స్వతంత్ర భారతావని’ని పురస్కరించుకుని జరిపే ఉత్సవాలకోసం ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నతస్థాయి జాతీయ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించాలని కోరారు. ఈ కార్యక్రమాలను ‘స్వాతంత్య్ర పోరాటం, 75 ఏళ్ల ఆదర్శాలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల కార్యాచరణ, 75 ఏళ్ల సంకల్పం’అనే ఐదు ఉప శీర్షికల కింద విభజించాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ప్రజా భాగస్వామ్యంతో జరిపే ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆలోచనలు, భావనలు, సూచనలు, కలలే కేంద్రంగా సాగాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి సూచనలు, సలహాలు ఇచ్చిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ నేత ఖర్గే, బీజేపీ చీఫ్ నడ్డా తదితరులున్నారు. ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో వారానికొక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలను చేపడతారు. దేశ వ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలను, నిర్మాణాలను ఎంపిక చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12న గుజరాత్ నుంచి ప్రధాని మోదీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించనున్నట్లు గుజరాత్ సీఎం రూపానీ వెల్లడించారు. నారీశక్తికి ఇవే నిదర్శనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రధాని మోదీ వినూత్నంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మహిళల వ్యాపారదక్షత, సృజనాత్మకత, భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పలు ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ‘నారీశక్తి’ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో ఆయా ఉత్పత్తుల విశిష్టతను వివరించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు మహిళలు ముందు వరుసలో నిలిచారని ట్విట్టర్లో కొనియాడారు. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
ఏ కులము నీదంటే?
దేశానికి ఇంకా స్వతంత్రం రాని రోజులవి. తనతో పాటు రైల్లో ప్రయాణిస్తున్న ఒక ఖద్దరు దుస్తుల వ్యక్తిని ఎగాదిగా చూస్తూ, ‘‘మనదే కులం బాబూ?’’ అని అడిగాడో పెద్దమనిషి. ‘‘గాంధీగారు నడయాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలూ, మతాలూ ఏమిటండీ?’’ అని నవ్వేశాడాయన. కానీ పెద్దమనిషి వదిలే రకంలా కనపడలేదు. ‘‘తమ తండ్రిగారు కులం తక్కువ పిల్లని కానీ మనువాడినారా నాయనా, చెప్పుకోటానికి సంకోచిస్తున్నావు?’’ అని ఎద్దేవా చేశాడు. ఖద్దరు మనిషి నొచ్చుకోలేదు సరికదా, చాదస్తపు పెద్దాయనకు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు: ‘‘నా కులం ఏదో నాకే అర్థం కాక చెప్పటానికి తటపటాయిస్తున్నాను. ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో నేను పాకీమనిషిని. గడ్డం గీసుకునే సమయంలో క్షురకుడిని. స్నానం చేయబోయే ముందు రజకునిలా రూపాంతరం చెంది విడిచిన బట్టలను ఉతుక్కుంటాను. ఆఫీసులో ఆవర్జా పుస్తకాలను వైశ్యుడిలా తయారు చేస్తాను. సాయంకాలం వేళల్లో నాపిల్లలకీ, వారి తోటి మిత్రులకీ పాఠాలు చెప్పేటప్పుడు పంతులుగా మారతాను. ఇప్పటికైనా తెలిసిందా నాకులం ఏదో’’ అని చెబుతుండగా రైలు స్టేషన్లో ఆగటం, కాంగ్రెస్ కార్యకర్తలు ‘జె.బి.కృపలానీకి జై’ అంటూ బిలబిలా బోగీ వైపు రావటం జరిగిపోయాయి. (మన్నవ గిరిధర రావు ‘పనికొచ్చే కథలు’ చదివాక.) పి.వి.ఎస్.సత్యనారాయణ -
ప్రతిధ్వనించే పుస్తకం
అమితవ్ ఘోష్ అమెరికాలో స్థిరపడిన భారతీయ రచయిత. ఆయన రెండో నవల ‘ద షాడో లైన్స్’ ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం చాలా దేశాలు వలస పాలన నుండి విముక్తి పొందిన నేపథ్యంలో కొత్త దేశాలు, కొత్త సరిహద్దులు, పెల్లుబికిన జాతీయవాదం రచయితలకు కథావస్తువులైనాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దానితో పాటు దేశం రెండుగా చీలిపోయింది. చిత్రంగా, స్వాతంత్య్రం కోసం కలిసి పోరాడిన శక్తులు ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క విభజన రేఖ ఇంతటి విలయాన్ని సృష్టించడం, మనుషుల మనసుల్లో గిరిగీసుకున్న దాటరాని వలయం – అదే షాడో లైన్స్ అంటే! ఈ నవలలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ, కథ ముఖ్యంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రథమ పురుషలో కథని వివరించే పేరులేని యువకుడు, అతని నానమ్మ (ఆమెను ‘తామ్మ’ అని పిలుస్తాడు), ఇంకా అతని చిన్నాన్న త్రిదేబ్. చిన్నాన్న త్రిదేబ్ అంటే బాల్యంలో కథకుడికి ఒక రోల్‌మోడల్, ఆదర్శం. అతని హఠాన్మరణం అతనికొక మిస్టరీ. బాల్యం, యవ్వనం మధ్య అతని జ్ఞాపకాలు ఊగిసలాడుతుంటయ్. సరిహద్దు ఆవలికి జరిగిపోయిన తన పుట్టిన ఊరు ఢాకా చూడాలని ఒకప్పుడు తహతహలాడిన బామ్మ తీవ్రమైన వైముఖ్యంతో మాట్లాడుతుంది 1962 ఇండో–పాక్ వార్ ప్రజ్వరిల్లినప్పుడు. ‘మనని వాళ్లు చంపడానికి రాకముందే వాళ్లని తుద ముట్టించాలి’ అని ఆమె హిస్టీరికల్గా మాట్లాడటం బాల్యంలో అతనికొక ఆశ్చర్యం. పెరిగి పెదై్ద తానుగా శోధించి సంఘటనల మూలాల్లోకి వెళ్లి సత్యం తెలుసుకుంటాడు. అదే ఉత్కంఠను మనం చివరిదాకా అనుభవిస్తాం. యువకుడి నాయనమ్మ బంగ్లాదేశ్ ఏర్పడ్డ (తూర్పు పాకిస్తాన్) సమయంలో కలకత్తాకు వలస వస్తుంది. తాను పుట్టి పెరిగిన ఢాకా ఇప్పుడు పరాయి దేశంలో భాగం అనే యధార్థాన్ని స్వీకరించడానికి ఆమె మనసులో ఒక తీవ్రమైన పెనుగులాట. తను పుట్టిన ఊరు చూడడానికి అక్కడ దగ్గరినించి ఆహ్వానం అందినప్పుడు (ఆమె భర్త ఢాకా ఎంబసీలో అధికారి) అదే ద్వైధీ భావనకు లోనవుతుంది. రెండు దేశాల మధ్య విమానం ఎగిరేప్పుడు సరిహద్దు రేఖ కనిపిస్తుందా? మరి లేదంటే ‘విభజన’ మాటకు అర్థమేమిటి? ఎన్నో సందేహాలు. దురదృష్టవశాత్తు అదే సమయంలో కశ్మీర్లో చెలరేగిన అల్లర్ల ప్రభావం ఢాకాలో ప్రతిధ్వనిస్తుంది. తన చిన్నప్పటి ఇంటికి కారులో వెళ్లి వస్తుంటుంది తామ్మ, ఆమెతో పాటు త్రిదేబ్, ఇతరులు. హఠాత్తుగా ఎదురైన అల్లరి మూకలు కారును, వెనుక రిక్షాలో వస్తున్న ఆమె పెదనాన్నను చుట్టుముడతాయి. అప్పుడే యువకుడి చిన్నాన్న త్రిదేబ్ వారి చేతులలో హతమౌతాడు. నానమ్మ మనసు విరిగిపోయింది. ఒక్కసారి హద్దు గీయబడిందంటే అది అనుల్లంఘనీయం అనే కఠిన వాస్తవం ఎరుకలోకి వచ్చింది. - తెన్నేటి శ్యామకృష్ణ -
మురిసిన మువ్వన్నెల జెండా
నంద్యాల: స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ నంద్యాలలో 350అడుగుల పొడవు ఉన్న జాతీయ జెండాను ప్రదర్శించారు. బడ్డింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సంస్థ, గురురాజ విద్యాసంస్థలు సంయుక్తగా ఈ భారీ జెండాను రూపొందించాయి. సంజీవనగర్ జంక్షన్, శ్రీనివాస సెంటర్, గాంధీచౌక్ ప్రాంతాల్లో జెండాను విద్యార్థులు ప్రదర్శిస్తుంటే స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
గ్రామ ప్రథమ పౌరుడికి...గౌరవభంగం!
ప్రోటోకాల్‌లో సర్పంచులకు సర్కారు మరో ఝలక్ జాతీయ పతాకావిష్కరణలో సంప్రదాయానికి గండి జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులకు పెద్దపీట జిల్లాలో గ్రూపులుగా అధికార పార్టీ నాయకులుl ‘ఆహ్వానం’ పంపడంలో ఎంఈవో, హెచ్ఎంలకు తలనొప్పి! స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ... ప్రజాప్రతినిధులంతా ఆ గౌరవం కోసం తహతహలాడుతుంటారు! జిల్లా కేంద్రం మినహా మిగతా ఎక్కడైనా ఆ గౌరవం ఇప్పటివరకూ గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కే సొంతం. తమ పరిధిలోని ఏ పాఠశాలలోనైనా స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఇప్పటి వరకూ వస్తోన్న సంప్రదాయం. దీన్ని ‘రాజకీయ కోణం’లో చూస్తూ టీడీపీ సర్కారు దానికి గండికొట్టింది. కొత్తగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తెరపైకి తీసుకొచ్చింది. హైస్కూళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ వారికి అప్పగించింది. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో నియమించిన టీడీపీ కార్యకర్తల హల్చల్తో సర్పంచులు నిమిత్తమాత్రులయ్యారు. ఈ కొత్త సంప్రదాయం ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులకు తలనొప్పి తీసుకొస్తోంది. జిల్లాలో అధికార పార్టీ నాయకులు గ్రామగ్రామాన గ్రూపు రాజకీయాలు పెంచిపోషిస్తుండటంతో ఎవ్వరిని ఆహ్వానిస్తే ఏం కొంప మునుగుతోందని మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో 470 ఉన్నత పాఠశాలలు, 567 ప్రాథమికోన్నత పాఠశాలలు, సుమారు 2,300 ప్రాథమిక పాఠశాలలున్నాయి. అలాగే జిల్లాలో 38 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఎనిమిది ఖాళీలు పోను 667 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. సర్పంచులు 1,099 మంది ఉన్నారు. అయితే ఇప్పటివరకూ అన్ని పాఠశాలల్లోనూ వాటి పరిధిలోని సర్పంచులే స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ చేసేవారు. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది సర్పంచులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులే గెలుపు సాధించారు. నాటి నుంచి వారి సర్పంచుల అధికారాలకు గండి కొట్టే ప్రయత్నాలు టీడీపీ ప్రభుత్వం మొదలెట్టింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు వంటి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ వచ్చింది. జన్మభూమి కమిటీలు ఆ కోణంలో వచ్చినవేనన్న విమర్శలు గురించి అందరికీ తెలిసిందే. నాటి గౌరవమేదీ? కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలకు సిఫారసు చేయాలన్నా, రేషన్ కార్డుల నుంచి బ్యాంకు రుణాల వరకూ, పింఛనుల నుంచి సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల జాబితాలు రూపొందించాలన్నా సర్పంచులదే కీలక పాత్ర. గ్రామంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచే అధ్యక్షత వహిండం.. లేదంటే ఆధ్వర్యం వహించాలి. కానీ ఆ గౌరవానికి గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తూనే వస్తోంది. జన్మభూమి కమిటీల సభ్యులకే సర్పంచుల అధికారాలన్నీ కట్టబెట్టేసింది. ఇప్పుడు పార్టీ గుర్తుపై గెలిచిన ప్రాదేశిక సభ్యులకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆహ్వానం’ పంపడానికి తర్జనభర్జన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి హైస్కూల్లోనూ జాతీయ పతాకావిష్కరణకు జెడ్పీటీసీ సభ్యుడునే ఆహ్వానించాలి. జనాభాను బట్టి ఒక్కో మండలంలో ఏడు నుంచి పది వరకూ హైస్కూళ్లు ఉన్నాయి. అంటే ఒక్కో జెడ్పీటీసీ సభుయడు ఏడు నుంచి పది చోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించాల్సి ఉంది. మండలం అంతా తిరిగి ఆయా హైస్కూళ్లలో పతాకాలను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి కార్యక్రమాలన్నీ ముగించేసరికి రోజంతా సరిపోద్ది. ఏదిఏమైనా జాతీయ పతాకాన్ని ఉదయం 11 గంటలలోపే ఆవిష్కరించాలి. కొన్ని పంచాయతీల్లో ఎంపీటీసీ సభ్యులు ఇద్దరు, కొన్నిచోట్ల ముగ్గురు కూడా ఉన్నారు. కానీ యూపీ స్కూల్ మాత్రమే ఒక్కటే ఉంది. అక్కడ ఎవ్వరిని ఆహ్వానించాలనే విషయంపై స్పష్టత లేదు. టీడీపీ గ్రూపులతో తలనొప్పి వేరయా... జిల్లాలో ప్రధానంగా మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లు వేర్వేరుగా గ్రూపులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా కూడా నాయకుల మధ్య గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో కార్యకర్తలే కాదు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులున్నారు. రాజాం నియోజకవర్గంలో కిమిడి కళా వెంకటరావు, మంత్రి అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్సీ ప్రతిభాభారతి మూడో గ్రూపు నిర్వహిస్తున్నారు. పాతపట్నంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు ఇటీవల పార్టీలోకి ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు, మంత్రి అచ్చెన్నాయుడి గ్రూపు, ఎచ్చెర్లలో కళా వెంకటరావు గ్రూపు, మంత్రి అచ్చెన్నాయుడు గ్రూపుల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు ప్రతి నాయకుడు జాతీయ పతాకావిష్కరణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఒకే స్కూల్ పరిధిలో ఇద్దరు ముగ్గురు నాయకులున్నచోట ఎవ్వరిని ఆహ్వానించాలో తెలియక ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబుది ఇదే తీరు... 2004 సంవత్సరానికి పూర్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి, సర్పంచుల హక్కులను కాలరాయడానికి చేయని ప్రయత్నం లేదు. వాటిని అడ్డుకోవడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. అందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ 2014 ఎన్నికల సమయంలో మాత్రం తానెంతో మారానని ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చారు. ఆ మార్పు మంచి కోసం ఉండాలి. కానీ తిరోగమనంలో వెళ్తోంది. స్థానిక సంస్థలకు రాజ్యాగం నిర్దేశించిన విధివిధానాలు ఉన్నాయి. వాటిని ఇష్టానుసారం మార్చుకుంటూ పోవడం హాస్యాస్పదం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్పంచులూ... హక్కుల కోసం గళమెత్తండి రాష్ట్రపతి తర్వాత చెక్‌పవర్ ఉన్న ఏకైక పదవి గ్రామ సర్పంచ్ ఒక్కటే. గ్రామానికి ప్రథమ పౌరులనే గౌరవం సర్పంచులదే. కేవలం టీడీపీ కార్యకర్తలతో నింపేసిన జన్మభూమి కమిటీలతో ప్రభుత్వం ఇప్పటికే వారినే అవమానించింది. ఇప్పటి వరకూ పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్‌లను కాదని, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ గౌరవం కల్పించడం సమంజసం కాదు. అలాగని వీరిని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఎంతో కష్టతరమైన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌కు తగిన గౌరవం కల్పించాలనేదే డిమాండు. అలాంటి గౌరవానికి భంగం కలిగిస్తే సర్పంచులు ఎలా బుద్ధి చెబుతారో ప్రభుత్వానికి తర్వాత తెలిసివస్తుంది. తమ హక్కుల రక్షణకు సర్పంచులు ఇప్పటికైనా ప్రభుత్వానికి నిరసనగళం వినిపించాలి. – తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు