
జాతీయజెండాను అవమానించిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించారు.
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన వంద అడుగుల భారీ ఎత్తయిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆవిష్కరించారు.
అయితే జెండా ఎగురవేసే సమయంలో అందరూ జెండాకు గౌరవ వందనం చేశారు. కానీ నారా లోకేశ్ మాత్రం జెండాకు వందనం చేయలేదు. సుమారు మూడు నిమిషాల పాటు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తే మంత్రి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు.