
చిన్నబాబుపై కుళ్లు జోకులు పేలుతున్నాయి..
సాక్షి, తిరుపతి : సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు తిరుపతి పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సభలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే స్లోగన్స్ ఉన్న కుర్చీలను చూసి చిన్నబాబు అవాక్కయ్యారు. శనివారం రేణిగుంట సమీపంలోని వికృత మాల వద్ద ఎన్టీఆర్ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లోకేష్ పాల్గొన్న సభలో చాలా కుర్చీలపై జగన్ స్టిక్కర్లున్నాయి. వీటిని చూసిన లోకేష్‌కు దిమ్మతిరిగింది. ఇది గమనించిన మీడియా ఫొటోలు, వీడియోలు తీయడంతో తేరుకున్న నిర్వాహకులు వాటిని సభ నుంచి తొలగించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. చిన్నబాబుపై కుళ్లు జోకులు పేలుతున్నాయి.
నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసారు. స్వార్ధ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి ఒప్పుకుని ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. టీడీపీ ఇప్పడు హడావిడిగా ఎన్నికల ముందు చేసే గారడీలను రాష్ట్రం నమ్మే పరిస్థితిలో లేదు. లోకేష్ సభలో కూడా వైయస్ఆర్ సీపీ స్టిక్కర్లు ఉన్నాయి. దీని పై ఏమంటారు? @JaiTDP @ncbn pic.twitter.com/wHAAxr9asI
— YSR Congress Party (@YSRCParty) 10 February 2019