జాతీయ జెండాను అవమానించిన వైద్యాధికారి ప్రతి రోజూ జాతీయ జెండాను ఎగరవేయాలని కోర్టు తీర్పునిచ్చింది.
వేలూరు(తమిళనాడు): జాతీయ జెండాను అవమానించిన వైద్యాధికారి ప్రతి రోజూ జాతీయ జెండాను ఎగరవేయాలని కోర్టు తీర్పునిచ్చింది. వేలూరు జిల్లా ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాత్యంత్ర దినోత్సవ వేడుక జరిగింది. అక్కడ ఆంబూరు ఎమ్మెల్యే బాలసుబ్రమణి జాతీయ జెండా ఎగరవేసిన సమయంలోనూ, జాతీయ గీతం పాడుతున్న సమయంలోనూ వైద్యాధికారి కెనడి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. వీటిపై కొన్ని టీవి ఛానల్స్‌లో ప్రచారం కావడంతో పాటు వాట్సాప్ ద్వారా పలువురికి ప్రచారం అయింది. దీంతో జాతీయ జెండాను అవమానించిన డాక్టర్ కెనడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆంబూరుకు నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో డాక్టర్ కెనడిని విచారించి మెమోను అందజేశారు. దీంతో ఫిర్యాదు దారుని కేసు నుంచి రక్షణ కల్పించాలని డాక్టర్ కెనడీ చెన్నై హైకోర్టులో ముందస్తు జామీను కోరాడు. జామీను ఇచ్చిన చెన్నై హైకోర్టు పలు నిబంధనలను విధించింది. జాతీయ జెండాను అవమానించిన డాక్టర్ కెనడీ ఏడు రోజుల పాటు జాతీయ జెండాను ఎగరవేయాలని, ముందుగా జెండాకు ఎటువంటి గౌరవం ఇవ్వాలో తెలుసుకోవాలని షరతు పెట్టింది.