బూట్లతో జాతీయ జెండా దిమ్మైపెకి.. | - | Sakshi
Sakshi News home page

బూట్లతో జాతీయ జెండా దిమ్మైపెకి..

Published Tue, Jun 20 2023 9:46 AM | Last Updated on Tue, Jun 20 2023 9:57 AM

- - Sakshi

మెదక్ : జాతీయ జెండా గద్దైపెకి ఓ పోలీసు అధికారిణి బూట్లతో ఎక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీయడానికి అక్కడికి వచ్చిన ఏఎస్‌ఐ స్వరూపరాణి కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ జెండా గద్దైపెకి బూట్లు తీయకుండా ఎక్కారు. ఈ దృశ్యాన్ని కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అధికారి తీరుపై పలువురు విమర్శలు చేశారు. బాధ్యత కలిగిన ఓ అధికారి ఇలా చేయడం తగదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement