swaroop
-
బూట్లతో జాతీయ జెండా దిమ్మైపెకి..
మెదక్ : జాతీయ జెండా గద్దైపెకి ఓ పోలీసు అధికారిణి బూట్లతో ఎక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తన మొబైల్ ఫోన్లో వీడియో తీయడానికి అక్కడికి వచ్చిన ఏఎస్ఐ స్వరూపరాణి కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ జెండా గద్దైపెకి బూట్లు తీయకుండా ఎక్కారు. ఈ దృశ్యాన్ని కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారి తీరుపై పలువురు విమర్శలు చేశారు. బాధ్యత కలిగిన ఓ అధికారి ఇలా చేయడం తగదని అన్నారు. -
దావూద్ ఇబ్రహీంకు, ఆర్జీవీకి చాలా పోలికలుంటాయి: డైరెక్టర్
'ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే మిషన్ ఇంపాజిబుల్' అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ► మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా. ► రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా. ► మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా అని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫెషనల్ యాక్టర్. ముందురోజే డైలాగులు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటలకల్లా సెట్‌కు వచ్చే వారు. ► ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పిల్లలో ఒకరు దావూద్ ఫొటో చూసి రామ్ గోపాల్ వర్మ అనుకుంటాడు. నేను చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని. నాలాగే ఎంతోమంది అలా అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ చాలా పోలికలుంటాయి. అందుకే ట్రైలర్లో చూపించాను. ► టైటిల్ ఆంగ్లంలో `మిషన్..` అనేది పెట్టడానికి కారణం కూడా పిల్లలు స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. అందుకే అలా పెట్టాం. సినిమా చూస్తే అర్థమవుతుంది. ► షూటింగ్ ను మన నేటివిటీకి తగినట్లుగానే తీశాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలలో షూట్ చేశాం. ► కొత్తగా ఎటువంటి సినిమాలు కమిట్ కాలేదు. ఏజెంట్...కు సీక్వెల్ తీయాలనుకున్నాం. కాని దానికి మించి వుండాలి. అందుకే సమయం తీసుకుని చేయాలనుంది. ఏజెంట్.. ను హిందీలో తీయాల్సి వస్తే పూర్తి నేటివిటీ మార్చి తీయాలి. దానికి నేను దర్శకత్వం వహించను అని అన్నారు. చదవండి: తను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై నటుడి ఆగ్రహం.. -
టాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్ ’లో తాప్సీ
టాలీవుడ్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. దీంతో ఈ భామ టాలీవుడ్‌కి దూరమైపోయింది. మహి డైరక్షన్ లో ఆనందోబ్రహ్మ సినిమా తర్వాత తాప్సీ తెలుగు సినిమాల్లో నటించలేదు. లేటెస్ట్గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సొట్టబుగ్గల సుందరి. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటిస్తోంది తాప్సీ. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాను అందించిన స్వరూప్ అందిస్తున్న సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మించే ఈ సినిమాను ఓ వైవిధ్యమైన సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నారు. మంగళవారం నుంచి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది చిత్ర యూనిట్. అలాగే చేతికి కట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా తాప్సీ పన్ను మాట్లాడుతూ - ‘గత 7 సంవత్సరాలుగా ఒక ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. మిషన్ ఇంపాజిబుల్ అలాంటి చిత్రాల్లో ఒకటి. ఆకట్టుకునే కథాంశం మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ లాంటి మంచి టీమ్ కావడంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాలలో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోగలను అని నమ్ముతున్నాను’ అన్నారు. -
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ పూర్తి
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా నటిస్తున్న డిటెక్టివ్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. దర్శకుడు స్వరూప్ RSJ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదాత్మకంగా ఉన్న నవీన్ పొలిశెట్టి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు తెరపై ఈ తరహా కథలు వచ్చి చాలా కాలం కావటంతో ఈ కామెడీ ఏజెంట్ మెప్పిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు మార్క్ K రాబిన్ సంగీతం అందిస్తుండగా.. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మళ్లీ రావా లాంటి చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
అయ్యన్నఅనుచరుడిపై కేసు నమోదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచరుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రికి సన్నిహితుడంటూ చెప్పుకుంటున్న స్వరూప్ అనే వ్యక్తి స్ధానికంగా ఉండే బిల్డర్ వంశీ అనే వ్యక్తిని బెదిరించడంతో పాటు దాడి చేసి గాయపరిచాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాదితుని ఫిర్యాదు మేరకు పోలీసులు 448, 323, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.