హైదరాబాద్‌లో ఎత్తైన జాతీయ పతాకం: కేసీఆర్
హైదరాబాద్: దేశంలోకెల్లా అతి పెద్ద, ఎత్తైన జాతీయ పతాకాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఘాట్ వద్ద ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆయన ఆదేశించారు. 301 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఉండాలని, అందుకనుగుణంగా పోల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచిలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, అంతకంటే పెద్ద జెండా తెలంగాణలో ఎగుర వేయాలని అన్నారు. పౌరుల్లో జాతీయ భావనను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.