
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, స్ఫూర్తిని పెంపొందించే అతిపెద్ద మువ్వన్నెల జెండా బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఎగిరింది. దేశంలోని అన్ని ఎ–1 రైల్వేస్టేషన్‌ల వద్ద అతిపెద్ద జాతీయ జెండాలను ఏర్పాటు చేయాలని ఇటీవల రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదట సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఈ 100 అడుగుల పొడవైన జెండాను ఏర్పాటు చేశారు.
స్టేషన్ మేనేజర్ సీబీఎన్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ క్యాబిన్‌మన్ ఆర్.అశోకా చారి జెండాను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన త్రివర్ణపతాకం సమున్నతంగా గోచరిస్తూ ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతోంది. కార్యక్రమంలో సీనియర్ టెక్నీషియన్ గోపాల్‌రెడ్డి, జీఆర్‌పీ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment