నగరంలో శనివారం నిర్వహించిన అలిండియా సివిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయజెండాతోపాటు, సాప్ జెండాను, క్రికెట్ టోర్నమెంటు జెండాను ఆవిష్కరించాల్సి ఉండగా.. జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా.. తాడు సరిగ్గా ఉడి రాకపోవడంతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకుండానే.. సాప్, క్రికెట్ టోర్నమెంట్ జెండాలను ఆవిష్కరించి సీఎం చంద్రబాబు సెల్యూట్ చేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత జాతీయజెండా దిమ్మను అక్కడినుంచి అధికారులు తొలగించారు. జాతీయ జెండా ఆవిష్కరించకుండా సెల్యూట్ చేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం నిబంధనలకు విరుద్ధం. కానీ సీఎం, ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం అక్కడివారిని విస్మయ పరిచింది. జాతీయ జెండా పీకిన దిమ్మెను తొలగించిన విషయాన్ని మీడియా కవర్ చేయడంతో విమర్శలు రాకుండా.. మళ్లీ జాతీయజెండాను సరిచేసి యథాస్థానంలో దిమ్మెను నిలబెట్టారు.
బాబు కళ్లముందే జాతీయజెండాకు అవమానం!
Published Sat, Jan 27 2018 12:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
Advertisement