repbulic day
-
Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే..
భారతదేశం 2025, జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణలకు కేంద్రంగా మారనుంది.గణతంత్ర దినోత్సవ కవాతు జనవరి 26న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కవాతు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ప్రారంభమై, కర్తవ్య పథ్ ద్వారా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ సంవత్సరం కవాతు కార్యక్రమం, శకటాలు, ముఖ్య అతిథి, థీమ్, భద్రతా వివరాలు ఇలా ఉన్నాయి.గణతంత్ర దినోత్సవం 2025 థీమ్76వ గణతంత్ర దినోత్సవం థీమ్ 'స్వర్ణ భారతదేశం: వారసత్వం- పురోగతి'. ఈసారి కవాతు 90 నిమిషాల్లో ముగియనుంది. ఈసారి కవాతులో 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా మొత్తం 5,000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.త్రివిధ సైన్యాల ఉమ్మడి శకటంగణతంత్ర దినోత్సవ చరిత్రలో తొలిసారిగా మూడు దళాలు అంటే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన ఒకే శకటం ప్రదర్శితం కానుంది. కవాతులో మొదటిసారిగా మూడు సాయుధ దళాల విభాగాల ప్రత్యేక శకటాలు ఉండవు. ఈ మూడు విభాగాల సమన్వయాన్ని తెలిపేదిగా ఉమ్మడి శకటాన్ని రూపొందించారు.రాష్ట్రాల ఘనతను చాటే శకటాలుగణతంత్ర దినోత్సవ కవాతులో బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, చండీగఢ్, గోవా, హర్యానా,జార్ఖండ్‌తో సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శితం కానున్నాయి. 2025 మహాకుంభ్ ప్రాముఖ్యతను తెలియజేసే శకటం ప్రత్యేక ఆకర్షణ కానుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు కూడా కనిపించనున్నాయి.ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడుఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఈసారి తొలిసారిగా ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్, బ్యాండ్ బృందం గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననుంది. కాగా 1950లో జరిగిన భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భద్రతా ఏర్పాట్లుగణతంత్ర దినోత్సవం వేడుకల వేదిక సమీపంలో యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. ఆర్మీ హెలికాప్టర్లు గస్తీ తిరుగుతాయి. దీనితో పాటు ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, డీర్డీఓ శాస్త్రవేత్తలు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు. 14 'పరాక్రమ్' కమాండో వాహనాలను ఇప్పటికే మోహరించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
బాబు కళ్లముందే జాతీయజెండాకు అవమానం!
సాక్షి, విజయవాడ: నగరంలో శనివారం నిర్వహించిన ఆలిండియా సివిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయజెండాతోపాటు, సాప్ జెండాను, క్రికెట్ టోర్నమెంటు జెండాను ఆవిష్కరించాల్సి ఉండగా.. జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా.. తాడు సరిగ్గా ఉడి రాకపోవడంతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకుండానే.. సాప్, క్రికెట్ టోర్నమెంట్ జెండాలను ఆవిష్కరించి సీఎం చంద్రబాబు సెల్యూట్ చేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత జాతీయజెండా దిమ్మను అక్కడినుంచి అధికారులు తొలగించారు. జాతీయ జెండా ఆవిష్కరించకుండా సెల్యూట్ చేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం నిబంధనలకు విరుద్ధం. కానీ సీఎం, ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం అక్కడివారిని విస్మయ పరిచింది. జాతీయ జెండా దిమ్మెను తొలగించిన విషయాన్ని మీడియా కవర్ చేయడంతో విమర్శలు రాకుండా.. మళ్లీ జాతీయజెండాను సరిచేసి యథాస్థానంలో దిమ్మెను నిలబెట్టారు. నిన్న (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక సీఎం జాతీయ పండుగలో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఈరోజు టోర్నమెంటు ప్రారంభోత్సవంలో చంద్రబాబు, అధికారుల సమక్షంలోనే జాతీయ జెండాకు అవమానం జరగడం విమర్శలకు తావిస్తోంది. -
బాబు కళ్లముందే జాతీయజెండాకు అవమానం!
-
రిపబ్లిక్‌డే రిహార్సల్స్
టీనగర్, న్యూస్‌లైన్: రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులతో రిహార్సల్స్ నిర్వహించారు. రిపబ్లిక్‌డేకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులను నియమించారు. కొన్నేళ్ల క్రితం సమద్ర మార్గంలో దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ తీవ్రవాదులు ముంబరుు తాజ్ హోటల్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో వంద మందికిపైగా బలయ్యారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత దేశానికి తీవ్రవాదుల నుంచి బెది రింపులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఆదివారం దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదివరకే హెచ్చరికలు చేశాయి. సముద్ర మార్గం ద్వారానే కాకుండా విమానాన్ని హైజాక్ చేసి విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి తీవ్రవాదుల నుంచి ప్రత్యక్ష బెదిరింపులు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ రామానుజం ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమవుతున్నారు. చెన్నై మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రోశయ్య జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, ముఖ్య ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో త్రివిధ దళాధిపతుల పరేడ్లు, విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలంకార శకటాల ప్రదర్శనలు జరుగుతాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎగ్మూర్, సెంట్రల్ వంటి ముఖ్య రైల్వే స్టేషన్లకు, కోయంబేడు, ప్యారిస్, తాంబరం వంటి బస్టాండు ప్రదేశాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు.