ఆలిండియా సివిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం
సాక్షి, విజయవాడ: నగరంలో శనివారం నిర్వహించిన ఆలిండియా సివిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయజెండాతోపాటు, సాప్ జెండాను, క్రికెట్ టోర్నమెంటు జెండాను ఆవిష్కరించాల్సి ఉండగా.. జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా.. తాడు సరిగ్గా ఉడి రాకపోవడంతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకుండానే.. సాప్, క్రికెట్ టోర్నమెంట్ జెండాలను ఆవిష్కరించి సీఎం చంద్రబాబు సెల్యూట్ చేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత జాతీయజెండా దిమ్మను అక్కడినుంచి అధికారులు తొలగించారు. జాతీయ జెండా ఆవిష్కరించకుండా సెల్యూట్ చేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం నిబంధనలకు విరుద్ధం. కానీ సీఎం, ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం అక్కడివారిని విస్మయ పరిచింది. జాతీయ జెండా దిమ్మెను తొలగించిన విషయాన్ని మీడియా కవర్ చేయడంతో విమర్శలు రాకుండా.. మళ్లీ జాతీయజెండాను సరిచేసి యథాస్థానంలో దిమ్మెను నిలబెట్టారు.
నిన్న (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక సీఎం జాతీయ పండుగలో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఈరోజు టోర్నమెంటు ప్రారంభోత్సవంలో చంద్రబాబు, అధికారుల సమక్షంలోనే జాతీయ జెండాకు అవమానం జరగడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment