జాతీయ జెండా ఏ ఒక్క వ్యక్తికో, మతానికో, కులానికో సంబంధించింది కాదని, అందరికీ చెందినదని సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ జెండాలోని మూడు రంగులు, అశోకధర్మచక్రం.. జాతి సమగ్రతకు, సమైక్యతకు నిదర్శనాలని, దాన్ని చూసినప్పుడల్లా గుండెధైర్యం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ గురువారం హైదరాబాద్‌లోని ఎన్డీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పవన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా చరిత్రకు సంబంధించి పలు కీలక విషయాలను గుర్తుచేసిన ఆయన.. యువతచే జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు.