ఘనంగా తిరంగా దివాస్
గుడివాడ టౌన్ (కృష్ణాజిల్లా) :
పట్టణంలో తిరంగా దివాస్ ర్యాలీ గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రుచౌక్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక త్రివేణి పబ్లిక్ స్కూల్‌కు చెందిన వేయ్యి మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని 4000 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం వజ్రోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిచినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జీ) ప్రారంభించారు. కార్యక్రమంలో త్రివేణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్.శివశంకర్ పాల్గొన్నారు.