జాతీయ జెండాకు అవమానం
జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఏపీ ఈఆర్‌సీ చైర్మన్ వాహనానికి జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేశారు.
– ఏపీ ఈఆర్‌సీ వాహనానికి తలకిందులుగా అమర్చిన జాతీయ జెండా
కర్నూలు (రాజ్‌విహార్): జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఏపీ ఈఆర్‌సీ చైర్మన్ వాహనానికి జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఎస్‌పీడీసీఎల్ డిస్కం ఇచ్చిన నివేదికలపై గురువారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఏపీ ఈఆర్‌సీ బృందం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ జి. భవానీప్రసాద్‌కు సమకూర్చిన ఇన్నోవా వాహనానికి జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌గా ఉన్న ఆయన వాహనానికి జెండాను ఏర్పాటు చేయడంలో స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను అవమానించడం సరికాదని చర్చించుకున్నారు. చివరకు సాయంత్రం గమనించి అధికారులు హడావిడిగా జెండాను సరిచేశారు.