మూడు అంశాల ఆధారంగానే.. సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు | Transfers to Secretariat employees are based on three factors | Sakshi
Sakshi News home page

మూడు అంశాల ఆధారంగానే.. సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు

Published Wed, Apr 26 2023 5:16 AM | Last Updated on Wed, Apr 26 2023 5:16 AM

Transfers to Secretariat employees are based on three factors - Sakshi

సాక్షి, అమరావతి: పరస్పర అంగీకార బదిలీలతో పాటు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులై ఉండి వేర్వేరుచోట్ల పనిచేస్తున్న వారికి.. ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి మాత్రమే ఈ ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను పరిమితం చేయాలని ఆ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.

ఉమ్మ డి జిల్లాల ప్రాతిపదికనే ఈ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తూ.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, అలాగే ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు సైతం అవకాశం కల్పించాలని నిర్ణ యించారు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, కేవ లం నాలుగు నెలల కాలంలోనే కొత్తగా 1.34 లక్షల శాశ్వ త ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలి సిందే. అప్పట్లో ఈ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు  మూడున్నరేళ్లలోపు సర్విసును పూర్తిచేసుకున్నారు.  

విధివిధానాల ఖరారుకు కసరత్తు 
ఈ ఏడాది సాధారణ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా తొలిసారి బదిలీలకు అవకాశం కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విధివిధానాల ఖరారుపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ మంగళవారం ఆ శాఖ అధికారులతో ఈ విషయమై సమీక్షించారు. వివిధ సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయి వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు.  

సాధారణ వినతుల బదిలీలకు కళ్లెం.. 
ఇక సాధారణ వినతి మేరకు బదిలీలకు అవకాశం కల్పిస్తే.. మారుమూల గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులందరూ బదిలీలు కోరుకుంటారని.. దీంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నందున ఆ తరహా బదిలీలను పూర్తిగా కట్టడి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో పరసర్ప అంగీకారం, భార్యాభర్తల అంశం, మెడికల్‌ గ్రౌండ్‌.. ఈ మూడు అంశాల ప్రాతిపదికన ఈసారి బదిలీలకు పరిమితం కావాలని నిర్ణయించారు. వీటి ప్రాతిపదికన కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

భార్యాభర్తల ప్రాతిపదికన కూడా ఇద్దరూ ప్రభుత్వోద్యోగులైతేనే (కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఏ విభాగమైనా) పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే, ఉద్యోగి సొంత గ్రామానికి ఎట్టి పరిస్థితిలోనూ బదిలీ చేయరు. ఇక ఈ బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను సిద్ధం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement