సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం | YS Jagan Holds Cabinet Meeting At Secretariat Over Kharif season And Covid Control | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభం

Published Wed, Jun 30 2021 12:03 PM | Last Updated on Wed, Jun 30 2021 1:15 PM

YS Jagan Holds Cabinet Meeting At Secretariat Over Kharif season And Covid Control - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం అయింది. ఈ సమావేశంలో జులై 8న రైతు దినోత్సవం నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. నూతన ఐటీ పాలసీకి ఆమోదం, జగనన్న టౌన్‌షిప్ ప్రోగ్రాంపై చర్చ జరగనుంది. రైతుల కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది.

వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్‌.. జులై 1, 3, 4 తేదీల్లో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement