
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీపీఎస్‌పై సంప్రదింపుల (కన్సల్టేటివ్) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి ( జీఎడి సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి
పాల్గొన్నారు.
కాగా, ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులులు ఎపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ప్రసాద్, ఇతర నేతలు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: ఏపీలో అర్హులందరికీ పథకాలు
Comments
Please login to add a commentAdd a comment