bothsa sathyanarayana
-
గోల్మాల్ ‘బాబు’.. ఈసీని నమ్మేదేలా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహస్యం పాలు అయినట్టేనా?. ఎన్నికల్లో రెఫరీగా ఉండి నిక్కచ్చిగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల ముఖ్య అధికారి ఒక రాజకీయ పార్టీతో కుమ్మకై తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అన్న విషయం రాను రాను బలపడుతోందా?. తెలుగు దేశం, జనసేన, బీజేపీ.. కూటమికి శాసనసభ, లోకసభ ఎన్నికల్లో అసాధరణమైన సంఖ్యలో సీట్లు, ఓట్లు వచ్చిన తీరు చూసి అంతా బిత్తరపోయారు.మొదట ఏమోలే! టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు పనిచేశాయని భావించారు. కానీ, ఆ తర్వాత వెల్లడైన అనేక విషయాలు దిగ్భాంత్రి కలిగించాయి. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగినట్లు చూపడం, వైఎస్సార్సీపీ బలమైన చోట్ల అసలు ఓట్లు రాకపోవడం, పలువురు తాము వైఎస్సార్సీపీ ఓట్లు వేశామని, అయినా తమ బూత్‌లో ఇంత తక్కువ ఓట్లు ఎలా నమోదు అవుతాయని సందేహాలు వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓటింగ్ శాతం ఏకంగా 12.5 శాతం పెరగడాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘాలు తప్పుబట్టాయి.ఇద్దరు ముగ్గురు వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఈ ఓట్లు, మెజార్టీలు, ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ పోలింగ్ నాటి కంటే కౌంటింగ్ నాటికి పెరిగిన తీరుపై అనుమానాలు వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా నిబంధనల ప్రకారం నిర్ధిష్ట ఫీజును కూడా చెల్లించి రీ-వెరిఫికేషన్ కోరారు. అంటే దాని ప్రకారం ఈవీఎంలో ఆయా రాజకీయ పక్షాలకు నమోదైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్‌లలో రికార్డు అయిన ఓట్లకు సరిపోల్చడం అన్నమాట. ఈ రెండు మ్యాచ్ అయితే ఈవీఎంలపై ఎవరికీ అనుమానం రాదు. ఎన్నికల సంఘం తరపున పనిచేసిన జిల్లా అధికారులు కొందరు దీనిపై ప్రవర్తించిన తీరు, ఎన్నికల ముఖ్య అధికారి మీనా అప్పట్లో హడావుడిగా ఇచ్చిన అదేశాలు, ఈవీఎంలో డేటాను తొలగించారు అన్న సమాచారం, వీవీప్యాట్ స్లిప్‌లను బర్న్ చేశారు అన్న విషయం నిర్ధారణ అవ్వడంతో ఏపీలో కూటమి గెలుపులో ఈవీఎంల హ్యాకింగ్, టాంపరింగ్ వంటి అక్రమాలు జరిగి ఉండవచ్చన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.ఈ విమర్శలపై ఎన్నికల సంఘం నిజాయితీగా స్పందించడం లేదని స్పష్టం అవుతోంది. ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్ధి బొత్స అప్పల నర్సయ్యలు కౌంటింగ్ జరిగిన కొద్ది రోజులకే రీ-వెరిఫికేషన్ కోరారు. దాన్ని గమనించారో మరి ఏదో కారణంతోనో, నలబైదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్‌లను బర్న్ చేయాలంటూ ఎన్నికల ఉన్నతాధికారి సర్క్యూలర్ జారీ చేసారు. ఇంకా ఎవరైనా ఆ స్లిప్‌లను బర్న్ చేయాకపోతే వెంటనే చేయాలని అదేశించారు. తొలుత ఆ సంగతి తెలియలేదు కానీ, ఒంగోలు, విజయనగరంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు పట్టుబట్టడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి.మొదట ఫిర్యాదులు విత్‌డ్రా చేసుకోవాలని కోరుతూ వీరిపై ఒత్తిడి తేవడమే అనుమానాలకు తావు ఇచ్చింది. వారు తలోగ్గకపోవడంతో రీ-వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. దీనిపై బాలినేని అభ్యంతరం చెప్పి హైకోర్టుకు వెలితే దీనిపై అక్కడ ఇప్పటికి తీర్పు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఈ వ్యవహరంలో న్యాయవ్యవస్థ సైతం దురదృష్టవశాత్తు తాత్సార్యం చేస్తోంది. బాలినేని దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లడానికి సిద్దపడ్డారు. కానీ, హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు. దీనితో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక విజయనగరం జిల్లాలో ఈవీఎం బాక్స్ తాళం కోసం గంటల తరబడి వెతుకులాట అశ్చర్యం కలిగిస్తోంది.ఆ తర్వాత ఇక్కడ సైతం ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్‌ల వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్ డ్రామాను అధికారులు ఎంచుకోవడం, అది ఎన్నికల సంఘం అదేశాల మేరేకే అని చెప్పడం కచ్చితంగా ఈ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందన్న భావనకు అస్కారం ఇచ్చింది. పైగా ఈవీఎంలో డేటా తీసివేశామని, స్లిప్‌లను బర్న్ చేశామని, ఈసీ సూచన మేరకు చేశామని అధికారులు చెప్పడంతో ఏపీ ప్రజలు ఎన్నికల్లో దారుణమైన మోసం జరిగిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే ఇది ఈవీఎంల ప్రభుత్వం అన్న వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. 2009లో ఈవీఎంలను వ్యతిరేకించి హ్యాక్ అవుతాయని ప్రచారం చేసిన చంద్రబాబు 2019లో ఓటమి తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. అలాగే మరి కొందరు కూడా సుప్రీం కోర్టును అశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు వీవీప్యాట్ల వ్యవస్థను తెచ్చింది.2024 ఎన్నికల తర్వాత ఇంత గందగోళం జరుగుతున్నా, టాంపరింగ్ అరోపణలు వస్తున్నా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ఎవరు నోరు మెదపడం లేదు. ఇది కూడా జనంలో అనుమానం రేకెత్తించింది. విజయనగరంలో పోలింగ్‌నాడు ఈవీఎం బ్యాటరీలో 50 శాతం చార్జింగ్ ఉన్నట్టు సీసీ కేమేరాల్లో రికార్డు అయితే 21 రోజుల తర్వాత జరిగిన కౌంటింగ్‌లో బ్యాటరీ శాతం 99 శాతం చూపించడం చిత్రంగా ఉంది. దీనిపై పరిశీలన కోరితే బెల్ ఇంజనీరు ఏమో ఎన్నికల సంఘం ఇచ్చిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రోసిజర్స్లో బ్యాటరీ ప్రస్తావన లేదని తప్పించుకుంటున్నారు. ఈవీఎం డేటాను వీవీప్యాట్ స్లిప్ లతో లెక్కవేసి మ్యాచ్ చేసి చూపాలని అడిగితే ఆ డేటా కాని, స్లిప్‌లు కాని లేవని చేతులెత్తేశారు. ఇవి అన్ని చూస్తే ఏమనిపిస్తుంది. కచ్చితంగా ఎన్నికల సంఘం అనండి, ఎన్నికల నిర్వహణలో ముఖ్య అధికారులు అనండి, కూటమి నేతలతో కుమ్మక్కు అయ్యారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది.సింపుల్‌గా ఈవీఎంలో ఉన్న డేటాను, వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కవేస్తే సరిపోయే కేసును ఎన్నికల సంఘం ఇంత జఠిలంగా మార్చి అసలే మొత్తం డేటా, స్లిప్‌లు లేకుండా చేయడం దుర్మార్గం. గతంలో బ్యాలెట్ పేపర్స్ వ్యవస్థ ఉండేది. దాని వల్ల పోలింగ్‌లో గాని, కౌంటింగ్‌లో గాని జాప్యం జరుగుతుందని, కొందరు రిగ్గింగ్‌లకు పాల్పడుతున్నారని కౌంటింగ్‌లో అక్రమాలు చేస్తున్నారని భావించి ఈవీఎంల వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొదటి రోజుల్లో ఈవీఎంలపై పెద్దగా అనుమానాలు రాలేదు. కానీ, ఆ తర్వాత కాలంలో సాంకేతిక పరిజ్ఢానం పెరగడం, హ్యాకింగ్ వ్యవస్థ రావడం, సైబర్ నేరగాళ్ల గురించి వినడం, ట్యాంపరింగ్‌కు అవకాశం వంటివాటి నేపధ్యంలో సందేహాలు వచ్చినా, ఎన్నికల సంఘం ఇలా ఎందుకు చేస్తుందిలే అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల అధికారులు న్యాయబద్దంగా లేకుండా ఏపీలో టీడీపీ కూటమికి కొమ్ము కాయడం, చివరకు ఈవీఎంలో డేటా లేకుండా చేసినట్లు బయటపడడంతో ఇప్పుడు ప్రజల్లో సందేహాలు కాకుండా అక్రమాలపై ఒక నిర్ధారణ ఏర్పడింది.లక్షల కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్‌ను టెక్నాలజీ ద్వారా భూమి మీద నుంచి మ్యానేజ్ చేస్తున్నప్పుడు.. నేల మీదే ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద కష్టమా అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యనించారు. టీడీపీ జనసేనలు బీజేపీతో పోత్తు పెట్టుకోవడం, కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రావడం లేదన్న సర్వేలు వెలువడడంతో ఉన్నత స్థాయిలోనే ఈ అక్రమాలకు బీజం పడిందన్న సందేహలు వ్యక్తం అవతున్నాయి. ఇండియా కూటమి పక్షాలు, ఈవీఎంల అక్రమాలకు సంబంధించి బీజేపీపై ఆరోపణలు చేశాయి. దానికి తగ్గట్టుగా ఆంధ్ర, ఒడిశాలలో అశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఈ ఇద్దరు ముగ్గురు అయినా ఈపాటి ప్రయత్నం చేయకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదామో! మళ్లీ బాలెట్ పత్రాల పద్దతే బెటర్ అన్న భావన ఏర్పడుతోంది.గతంలో సీసీటీవీలు వంటివి లేకపోవడం వల్ల రిగ్గింగులకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా పర్యవేక్షించే సిస్టమ్స్ రావడంతో ఈ రిగ్గింగులను అరికట్టవచ్చు. బ్యాలెట్ పత్రాల సమయంలో జరిగిన అక్రమాల కన్నా, ఈవీఎంల ద్వారా జరిగే మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయన్న అబిప్రాయం ఏర్పడుతోంది. అమెరికా వంటి పెద్ద దేశాలలో సైతం బాలెట్ పత్రాలనే వాడుతున్నారు. భారతదేశంలో ఈవీఎంల వ్యవస్థ ద్వారా ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడింది.ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంల టాంపరింగ్ చేయవచ్చని వ్యాఖ్యానించినప్పుడు, ఇండియాలో అది జరదని ఈసీ జవాబు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత పరిణామాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈసీ పారదర్శకంగా లేదనిపిస్తుంది. పన్నెండు శాతం ఓట్లు పెరగడం నుంచి డేటా తీసివేయడం, వీవీప్యాట్ స్లిప్‌ల బర్న్ వరకు వచ్చిన అభియోగాలపై ఎన్నికల కమిషన్ నోరు విప్పకపోవడం మరింతగా సంశయాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినవారే భక్షిస్తున్నారా అన్న ప్రశ్న ఆవేదన కలిగిస్తుంది. ఎప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తుందా? ఏమో చెప్పలేం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
AP: ఉద్యోగ సంఘాలతో సీపీఎస్‌పై కన్సల్టేటివ్ భేటీ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీపీఎస్‌పై సంప్రదింపుల (కన్సల్టేటివ్) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి ( జీఎడి సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులులు ఎపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ప్రసాద్, ఇతర నేతలు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: ఏపీలో అర్హులందరికీ పథకాలు -
సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో టీడీపీ సృష్టిస్తున్న అరాచకాలు, ఆపద్ధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి ఫిర్యాదు చేశారు. ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి. రామచంద్రయ్య, అవంతి శ్రీనివాస్, బుట్టా రేణుక సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. -
సీఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం
-
బొత్స వర్సెస్ కిమిడి నాగార్జున
చీపురుపల్లి: ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొననున్నది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున పోటీలో నిలవనున్నారు. అనుభవానికి అనుభవలేమికి జరగనున్న పోటీల్లో గెలుపుపై నియోజకవర్గ ప్రజలు చర్చించు కుంటున్నారు. వీరి గుణగణాలను ప్రజలు బేరీజు వేసుకుం టున్నారు. బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన కళాశాల చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘ నాయకుడుగా పని చేశారు. ఆ తరువాత కాలంలో గాజులరేగ పీఏసీఎస్ అధ్యక్షుడిగా, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్‌గా పని చేశారు. 1998లో బొబ్బిలి ఎంపీగా గెలుపొం ది పార్లమెంటు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినేట్లో రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖా మంత్రిగా, మార్కెటింగ్శాఖా మంత్రిగా, పంచా యతీరాజ్, గృహ నిర్మాణశాఖా మంత్రిగా ఎలా ఎన్నో పదవులు అలరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా, రాష్ట్ర రాజకీయాలను శాసిం చే సమర్థత కలిగిన నాయకుడు. ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో కార్యకర్తలను సైతం పేరు పెట్టి పిలిచే నాయకుడు. అర్థరాత్రి, అపరాత్రి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఫోన్ చేస్తే నేరుగా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్ట, సుఖాలు విని వాటిని పరిష్కరించే గొప్ప మనిషి. ఆయన పదేళ్ల పదవీ కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలలు, అన్ని గ్రామాలకు రోడ్లు, నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీరు, టీటీడీ కల్యాణ మండపం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలోనే జరిగాయి. కిమిడి నాగార్జున కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2016 వరకు అమెరికా లో ఉద్యోగం చేశారు. అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి 2016లో చీపురుపల్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన తల్లి, ఎమ్మెల్యే మృణాళినితో కలిసి గ్రామాల్లోకి వెళుతూ పరిచయం చేసుకున్నాడు. రాజకీయంగా ఎలాంటి అనుభవం, పదవులు లేవు. ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి మృణాళిని వారసునిగా తప్ప ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు. -
‘వైఎస్సార్ పాలన కోసమే ఆయన పోరాటం’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసమో.. అధికారం కోసమో పోరాటం చేయటంలేదని, సమాజంలో సుపరిపాలన, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తీసుకురావటానికే పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయలు, అబద్దాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రానున్న కాలంలో భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్ పరిపాలన చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం.. సంక్షేమ రాజ్యం కోసం వైఎస్ జగన్ సీఎం అవ్వాలని స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు ఓ మంత్రిగా ఉంటూ భీమిలిలో అభివృద్ది చేశారా అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆఫీస్‌లో భూ రికార్డులు తారు మారు అవుతున్నాయంటే.. మంత్రి తీరు ఎలా వుందో అర్థం అవుతోంది అంటూ మండిపడ్డారు. 5 ఏళ్లుగా గంటా మంత్రిగా ఉన్నారు, ఏమి చేశారు.. అక్రమాలు, భూ కబ్జాలు తప్ప అంటూ ఆగ్రహం వ్యకం చేశారు. -
దేశంలోనే అవినీతి సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం, రేగిడి: దేశంలోనే నంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పేరు గడించారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం రేగిడి మండలం ఖండ్యాం గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి సీఎంగా మొదటి స్థానంలో ఉన్నట్లు సెంట్రల్ సర్వే కూడా తేల్చిందని పేర్కొన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. గ్రాఫిక్ రాజధానే తప్ప అమరావతిలో వాస్తవంగా అభివృద్ధి జరగలేదని చెప్పారు. లక్షల కోట్లు అప్పుతేవడంతో ప్రతి ఒక్కరిపై ఆర్ధికభారం పడుతుందని, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో టీడీపీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. తెలంగాణా రాష్ట్రంలో ఐటీ దాడుల్లో పట్టుబడిన రేవంత్ రెడ్డి అక్రమార్జన అంతా ఏపీలో చంద్రబాబునాయుడు దోచుకున్నదేనని ఆరోపించారు. బాబు పాలన చూసి ఇటు ప్రజలు, అటు అధికారులు భయపడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డినే సీఎం చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి వెనుక అవినీతి... వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీలో అవినీతిమంత్రులు అధికమయ్యారని ఆరోపించారు. నీరు చెట్టు, కాంట్రాక్ట్‌లు, రియల్ ఎస్టేట్ల పేరుతో అక్రమార్జన చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పలుచోట్ల ఓటమి భయంతో వేరే పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి తీసుకువచ్చి డబ్బుతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల రాజాం నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ మంత్రిని టీడీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించడం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. టీడీపీలో చేరుతున్న కొత్తనాయకులు కూడా అట్రాసిటీ కేసులు, అక్రమాలు, అవినీతి చేసినవారేనని ఆరోపించారు. రేగిడి మండలానికి చెందిన ఓ టీడీపీ మంత్రి 35 ఏళ్లపాటు కుటుంబ పాలన చేశారని, ఇకపై ఆ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సమన్వయంతో వ్యవహరించాలి.. బూత్ కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు పాలవలస రాజశేఖరం అన్నారు. ముందుగా ఓట్లు ఉన్నాయోలేదో చూసుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఓట్లను టీడీపీ నాయకులు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయమై బూత్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులంతా వైఎస్సార్ సీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అమలు పర్చేలా జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి మాదిరిగానే సేవలందిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ విజయనగరం, శ్రీకాకుళం రీజనల్ కో ఆర్డినేటర్ భూమన కరుణాకర్‌రెడ్డి పార్టీ విధివిధానాలు, రానున్న ఎన్నికల్లో బూత్ కమిటీల కర్తవ్యం, నవరత్నాల పథకం అమలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణారావు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, నాయకులు మామిడి శ్రీకాంత్, ఉత్తరావిల్లి సురేష్‌ముఖర్జీ, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, పాలవలస శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, లావేటి రాజగోపాలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, గురుగుబెల్లి స్వామినాయుడు, రెడ్డి నర్సింగరావు, కింజరాపు సురేష్‌కుమార్, బండి నర్సింహులు, వంజరాపు విజయ్‌కుమార్, పొట్నూరు లక్ష్మణరావు, మజ్జి శ్రీనివాసరావు, ఎంపీటీసీ నెల్లి పెంటన్నాయుడు, వంజరాపు అశోక్‌కుమార్, పాడి లక్షున్నాయుడు, కెంబూరు శ్రీహరినాయుడు, కరణం గోవిందరావు, లావేటి అప్పలనాయుడు, రాయపురెడ్డి కృష్ణారావు, నక్క ఆదినారాయణ, నక్క తిరుపతిరావు, బట్న వాసుదేవరావు, అన్ను అప్పారావు, కొండగూడెం మాజీ సర్పంచ్ కెంబూరు సూర్యారావు, గులివిందల శ్రీనివాసరావు, శాసపు వేణుగోపాలనాయుడు, రెడ్డి మహేష్, కిల్లాన మోహనరావు, కొమ్ము దుర్గారావు, పాలవలస అప్పలనాయుడు, లెంక చిన్నప్పలనాయుడు, పిట్టా జగదీష్, కోరాడ రామినాయుడు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, బూత్ కమిటీ కన్వీనర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యం.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా సాధ్యపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, జగన్మోహన్రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల పక్షాన నిలిచారని అన్నారు. 3వేల కిలోమీటర్లు ప్రజాసంకల్ప యాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, మరో నెల రోజుల వ్యవధిలో జిల్లాకు రానున్నారని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే పార్టీని నమ్ముకొని ఉండిపోయానని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోబాలు పెట్టినప్పటికీ పార్టీని వీడలేదని, జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం ఉందో, తనకు పార్టీపై అంతే నమ్మకం ఉందన్నారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో రాజాంకు వచ్చే నిధులను, అభివృద్ధి పనులను అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్రెడ్డి సీఎం అయితే రాజాంను అభివృద్ధివైపు నడుపుతానని, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రావాలి జగన్... కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను వివరించారు. -
ప్రజల కష్టాలు పట్టని అశోక్‌గజపతిరాజు
సాక్షి, విజయనగరం : ఈ నాలుగేళ్లలో విజయనగరం జిల్లా సమస్యల గురించి కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నపుడు అశోక్‌గజపతిరాజు ఒక్కసారైనా చర్చించారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అలా చర్చించి ఉంటే తల దించుకుంటానని ఆయన అన్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల కాలంలో విజయనగరం జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు. రాచరికపు వ్యవస్థలో ఉన్న అశోక్‌గజపతిరాజుకు ప్రజల కష్టాలు పట్టవన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్టని ఆయన అన్నారు. నాలుగేళ్ల కాలంలో జిల్లాను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కోట సుందరీకరణ, విజ్జీ స్టేడియం అభివృద్ధి తప్ప ఇంకేమీ చేయలేదని అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోతుంటే కనీసం నష్టపరిహారం అందించలేదని, జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఒకటి మూసేశారన్నారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అత్యాచారాల నివారణకు చైతన్యం రావాల్సింది ప్రజల్లో కాదని, చంద్రబాబు నాయుడు కేబినేట్లో మార్పు రావాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు నాలుగేళ్ల అధికారంలో ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం నీతి నిజాయితీల గురించి ప్రజలు చెప్తారని అన్నారు. -
అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి : బొత్స
జామి: అవినీతిమయంగా మారిన చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా జామిలో నిర్వహించే పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిందన్నారు. మట్టి దగ్గర నుంచి ఇసుక వరకు సీఎం తనయుడు లోకేష్, పార్టీ నేతలు దోచుకున్నారన్నారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మహిళలను, నిరుద్యోగభృతి కల్పిస్తామని యువకులను ఇలా.. అన్ని రంగాలవారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పేదలకు ఇల్లు మంజూరు చేయని ఘనత టీడీపీదేనని విమర్శించారు. త్వరలో మంచిరోజులు వస్తాయని, మాట, మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి రైతుకు ఏటా సాగుఖర్చులకు రూ.12,500 ఇస్తారన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డిదేనన్నారు. శృంగవరపుకోట వైఎస్సార్ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త అల్లు జోగినాయుడు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), వైఎస్సార్ సీపీ శృంగవరపుకోట నియోజకవర్గం సమన్వయకర్త అల్లు జోగినాయుడు, పార్టీ రాష్ట్రకార్యదర్శి రొంగలి జగన్నాథం, రాష్ట్ర కారదర్శి నెక్కలనాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే వారం చర్చించక తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై వచ్చే వారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎంపీలు తెలిపారు. బుధవారం కూడా తీర్మానాన్ని చేపట్టకుండా సభ వాయిదా పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా దేశమంతా తెలియచేయటంలో వైఎస్సార్ సీపీ విజయం సాధించిందని మేకపాటి చెప్పారు. కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇవ్వనున్న నేపథ్యంలో తీర్పును అనుసరించి తమ నిరసన కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటామని ఏఐడీఎంకే ఎంపీలు చెప్పారన్నారు. వచ్చే వారంలో ఐదు రోజులు పాటు సభ జరిగే అవకాశం ఉండటంతో తప్పనిసరిగా అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరప కుండా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తే రాజీనామాలు సమర్పించ డానికి లేఖలు కూడా సిద్ధం చేసుకుని బుధవారం సభకు వచ్చినట్టు తెలిపారు. -
కల్తీలకు కేరాఫ్‌గా గుంటూరు
పట్నంబజారు (గుంటూరు): ప్రభుత్వ నిర్లిప్తత, అధికారుల అవినీతితో గుంటూరు జిల్లా కల్తీలకు కేరాఫ్‌గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలు.. విత్తనాలు, కారం, పాలు, నూనె అని తేడా లేకుండా కల్తీలకు పాల్పడుతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. గుంటూరు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో గురువారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఐదో విడత జన్మభూమిలో రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల అప్లికేషన్లు వస్తే..వాటిలో ఎన్ని పరిష్కరించగలిగారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ మూడున్నరేళ్ల పాలనలో చేసిన మంచి ఏమి లేదని, ప్రస్తుతం అందించిన దరఖాస్తుల్ని 2022లో పూర్తి చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఏ ఒక్కచోటా పేదవారికి ఇళ్లు కట్టించిన పాపాన పోలేదని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్టుపెట్టుకుని జన్మభూమి సభలు నిర్వహించడం దారుణమని ఖండించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ పాటుపడుతోందని, దానిలో భాగంగా జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో బూత్ కమిటీల్ని పటిష్టం చేసి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. జన్మభూమి సభల్లో కానరాని చిత్తశుద్ధి : ఉమ్మారెడ్డి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమి సభల్లో ఎక్కడా చిత్తశుద్ధి కనబడడం లేదని, ప్రభుత్వంలో జవాబుదారీతనం తగ్గిం దని విమర్శించారు. ఇప్పటి వరకూ నిర్వహిం చిన జన్మభూమి సభల్లో 42 లక్షల దాకా అర్జీ లు వచ్చాయని, వాటిల్లో లబ్ధిదారులకు ఎంత వరకూ న్యాయం జరిగిందని ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఆధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునేందుకు పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్, ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లపల్లి రామ్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ.నసీర్ అహ్మద్, మందపాటి శేషగిరిరావు, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనీ క్రిస్టినా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
'ఆరునూరైనా జగన్ దీక్ష జరుగుతుంది'
-
'ఆరునూరైనా జగన్ దీక్ష జరుగుతుంది'
గుంటూరు: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల నిబంధనలకు అనుగుణంగానే దీక్షాస్థలిలో నడుచుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని.. వాస్తవానికి ఈ పనులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రాజకీయాలు, వ్యాపారాల కోసం కేంద్రంలో చంద్రబాబు లాలూచీ పడ్డారని బొత్స విమర్శించారు. దీక్షకు సంబంధించి 3 ప్రదేశాలు సూచించినా చంద్రబాబు కాదనటం దారుణమన్నారు. నాలుగో దీక్షాస్థలికి కూడా అభ్యంతరం పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. దీక్ష జరగాల్సిన ప్రదేశంలో ఇప్పటికే అనేక సార్లు ఎగ్జిబిషన్లు జరిగాయని తెలిపారు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని బొత్స సత్యానారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఇక మా కథ ముగిసినట్టే!