న్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో టీడీపీ సృష్టిస్తున్న అరాచకాలు, ఆపద్ధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి ఫిర్యాదు చేశారు. ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విఙ్ఞప్తి చేశారు.