నెట్‌లో విన్నవిద్దాం..
తిరుపతి క్రైం: అయ్యా...! మా సమస్య పరిష్కరించండి .. అంటూ అర్జీలు చేతపట్టుకుని.. ఎర్రబస్సు ఎక్కి పల్లె నుంచి పట్టణాలకు.. రాజ ధాని కేంద్రాల్లోని కార్యాలయాల చుట్టూ తిరిగేవారు కోకొల్లాలు. రోజుల తరబడి పనులు మానుకుని ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి అంత దూరం వెళ్లాక అధికారులు, ప్రజాప్రతి నిధులు కానరాక సమస్యలు మరుగున పడుతున్న సందర్భాలు అనేకం. ఇప్పుడా పరిస్థితి నుంచి విముక్తి పొందే సరికొత్త సాంకేతిక పోకడలు అందివచ్చాయి. సమస్యలపై ఫిర్యా దు చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారా అర్జీ సమర్పించవచ్చు. తర్వాత సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర, దేశ ప్రజాప్రతినిధులను మొదలుకుని రాష్ట్రపతి వరకు ఫిర్యాదు చేయవచ్చు. అదెలాగో ...
రాష్ట్రపతికి ఇలా..
రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే www. president 0findia.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే అడుగుభాగంలో కుడివైపు హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్ ఎ రిక్వెస్ట్’ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అనే బాక్స్‌లో 400 పదాలకు మించకుండా సమస్య వివరించి పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన సమస్య పరిష్కారం అయిందో కాలేదో తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంఖ్య ఉపయోగపడుతుంది.
ప్రధానికి ఫిర్యాదు ఇలా..
దేశ ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.pmindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి సమస్యలను విన్నవించుకోవచ్చు. పేజీ ఓపెన్ చేయగానే ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పీఎం ’ వస్తుంది. క్లిక్ చేస్తే ‘టు రైట్ టు ది ప్రైమినిస్టర్ క్లిక్ హియర్ ’ అనివస్తుంది. దాన్ని క్లిక్ చే స్తే ‘కామెంట్స్ ’ అనే పేజీ తెరుచుకుంటుం ది. ఫిర్యాదుదారుడి వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీలో 1000 అక్షరాల లోపు సమస్యను విన్నవించి దిగువ భాగాన ఉన్న కోడ్‌ను నమోదు చేయాలి.
గవర్నర్‌కు..
aprajbhavan@gmail.com మెయిల్‌కు ఫిర్యాదుదారుడు తమ పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా నేరుగా పంపవచ్చు.
ముఖ్యమంత్రికి..
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.andhra.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగంలో సిటిజన్ ఇంటర్ ఫే అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ-మెయిల్ ఐడీని నమోదు చేసి సంబంధిత విషయాన్ని క్లుప్తంగా వివరించాలి. ఇంకేం ప్రయత్నించండి మరీ.