సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్వల్ప ఊరట లభించింది. చట్టంపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు దాఖలైన మొత్తం పిటిషన్లపై జనవరి 22న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. అలాగే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీచేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు కేంద్ర బిందువైన పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో 60 పిటిషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే వీటన్నింటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం చేపట్టింది. చట్టంపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైరాంరమేష్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా, ఆర్జేడీ, ముస్లింలీగ్ పార్టీల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment