న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల నియమించిన తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి ధర్మేంద్ర చాతుర్ పదవికి గుడ్ బై కొట్టేశారు. భారత్‌లో ట్విట్టర్ వినియోగదారుల œర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల ట్విట్టర్ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. కానీ ఇప్పుడు ట్విట్టర్ వెబ్‌సైట్‌లో ఆయన పేరు కనిపించడం లేదు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేశారు. భారత్ కొత్త డిజిటల్ చట్టం అమలులో ట్విట్టర్‌కు, కేంద్రానికి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ట్విట్టర్‌కి గ్రీవెన్స్ ఆఫీసర్ లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment