Goodbye Post
-
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. ఇక రాజకీయాలకు గుడ్ బై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా.. ‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, 2018లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2 — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022 …..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏 — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022 -
ట్విట్టర్‌కు గ్రీవెన్స్ ఆఫీసర్ ‘గుడ్ బై’
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల నియమించిన తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి ధర్మేంద్ర చాతుర్ పదవికి గుడ్ బై కొట్టేశారు. భారత్‌లో ట్విట్టర్ వినియోగదారుల œర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల ట్విట్టర్ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. కానీ ఇప్పుడు ట్విట్టర్ వెబ్సైట్లో ఆయన పేరు కనిపించడం లేదు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేశారు. భారత్ కొత్త డిజిటల్ చట్టం అమలులో ట్విట్టర్‌కు, కేంద్రానికి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ట్విట్టర్‌కి గ్రీవెన్స్ ఆఫీసర్ లేకపోవడం గమనార్హం. -
'చనిపోతున్నా.. అందరికీ బై'
ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఏడాదికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది. ఊపిరితిత్తుల మార్పిడి చేసినా ఆరోగ్యం మెరుగుకాదని వైద్యులు చెప్పడంతో విరక్తి చెందిన ఆమె.. 'చనిపోవాలని నిర్ణయించుకున్నా.. అందరికీ బై' అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. చికిత్సను నిరాకరించి కుటుంబ సభ్యుల మధ్య కన్నుమూసింది. ఇంగ్లండ్‌లోని సౌత్‌వేల్స్‌కు చెందిన 28 ఏళ్ల కిర్స్టీ బ్రిడ్జెస్ విషాద జీవిత కథ ఇది. బ్రిడ్జెస్ చిన్నతనం నుంచే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని ఆమె తల్లి చెప్పారు. సమస్య తీవ్రంకావడంతో ఏడాది నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో బ్రిడ్జెస్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జెస్ ఫేస్బుక్ పోస్ట్ చూసి వందలాది మంది ఫాలోవర్స్ స్పందించారు. చనిపోవాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని, చికిత్స చేయించుకోవాలని కోరారు. అయినా బ్రిడ్జెస్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత అన్ని రకాల చికిత్సలను ఆపివేసింది. ఆస్పత్రిలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో చనిపోయింది. డిసెంబర్ చివర్లో ఈ ఘటన జరిగింది.