హోమ్ లోన్ (home loan) వడ్డీ భారం భరించలేకపోతున్నారా.. ముందస్తుగా చెల్లించేందుకు డబ్బు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ పీఎఫ్ ఖాతా (PF Account) లోంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీ లోన్ చెల్లించేయండి. ఇందుకోసం అత్యధికంగా నగదు విత్‌డ్రా (PF withdraw) చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) కల్పిస్తోంది. అయితే ఇది లాభదాయకమా.. కాదా? అన్నది ఆలోచించుకోవాలి.
వడ్డీ రేటు, వయసు కీలకం
హోమ్ లోన్ వడ్డీ రేటు.. ఈపీఎఫ్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసి ఈ మొత్తంతో రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకుని లోన్ చెల్లించవచ్చు. ఎందుకంటే డబ్బును కూడబెట్టుకోవడానికి వీరికి చాలా కాలం ఉంటుంది. (ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్‌డేషన్‌కు కొత్త మార్గదర్శకాలు)
90 శాతం వరకు..
గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 90 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ అనుమతిస్తుంది. అయితే ఇందుకోసం 10 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. జాతీయ బ్యాంకులు, రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ వంటి సంస్థల నుంచి హోమ్ తీసుకుని ఉండాలి. హోమ్ లోన్ రీపేమెంట్ స్కీమ్ కింద ఈపీఎఫ్‌ఓ సభ్యులు వారి ఖాతా నుంచి ఈఎంఐలు కూడా చెల్లించవచ్చు.
ఇదీ ప్రాసెస్..
➤ EPFO e-service పోర్టల్‌కు లాగిన్ చేయండి.
➤ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
➤ ఆన్‌లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి.
➤ ఫారం 31 ద్వారా క్లెయిమ్ చేయండి.
➤ మీ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించండి.
➤ డబ్బు ఉపసంహరణకు కారణాన్ని ఎంచుకోండి.
➤ సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
అత్యవసరమైతేనే డ్రా చేయండి
చాలా అవసరం అయితే తప్ప పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయకూడదని మనీ మేనేజ్‌మెంట్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్‌ఓ చెల్లిస్తోంది.పీఎఫ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తే, రిటైర్‌మెంట్ ఫండ్‌పై అంత పెద్ద ప్రభావం పడుతుంది.
పీఎఫ్ ఖాతాలో ఎంత జమవుతుంది?
నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు తమ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేయడం తప్పనిసరి. అదే సమయంలో కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌లో ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లో జమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment