ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలో వేతనాలు పొందే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ నిధి. ఇందులో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను జమ చేస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటాయి.
ఇలా పోగైన మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత, వడ్డీతో పాటు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇతర ఆదాయాల మాదిరిగానే ఈపీఎఫ్ ఉపసంహరణలు కొన్ని పరిస్థితులలో పన్నుకు లోబడి ఉంటాయి.
ఈపీఫ్ విత్‌డ్రా షరతులు
- ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలోని మొత్తాన్ని సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా డ్రా చేసుకోవచ్చు.
- ఉద్యోగ విరమణకు ఒక సంవత్సరం ముందు అయితే పీఎఫ్ ఖాతాలోని 90 శాతం నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఇక నిరుద్యోగం విషయంలో అయితే ఉద్యోగం కోల్పోయిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
- ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఇతర అవసరాల నిమిత్తం తమ పీఎఫ్ నిధులను ఉపయోగించుకునేందుకు ఈ నియమాలు సౌలభ్యాన్ని అందిస్తాయి.
పన్నులేమైనా ఉంటాయా?
- ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై సాధారణంగా ఎలాంటి పన్ను ఉండదు. అయితే, మునుపటి సంవత్సరాల్లో జమ చేసిన మొత్తాలపై సెక్షన్ 80C కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 80C గతంలో క్లెయిమ్ చేయకుంటే అదనపు పన్ను వర్తించవచ్చు.
- ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తవ్వని ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకుంటే మూలం వద్ద పన్ను (TDS) మినహాయిస్తారు. అదే ఉపసంహరణ మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు.
- ఇక ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత చేసే ఈపీఎఫ్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఒకటి కంటే కంపెనీల్లో పనిచేసిన సందర్భంలో ఈ ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ఉద్యోగి పూర్వ కంపెనీలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment