Implications
-
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
అలా మార్చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా విధానంలో మార్పులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చడం పక్కన బెడితే, కొన్ని చాప్టర్లు తీసివేయడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని విద్యావేత్తలు అంటున్నారు. పురాతన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని తేవాలని తాజాగా జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు స్వాగతించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో స్థానిక అంశాలతో సిలబస్ ఉంది. వీటిని పరిగణనలోనికి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వేర్వేరు సిలబస్‌లతో ఇబ్బందులు ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరు సిలబస్‌లు అమలు చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన విద్యావేత్తల నుంచి విన్పిస్తోంది. మారిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని సిలబస్‌లో మార్పులు తేవాలనే అంశంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. పోటీ పరీక్షలుసవాలే.. ఎన్సీఈఆర్టీ సూచించిన మార్పుల్లో అనేక అంశాలున్నాయి. క్లాసికల్ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. ప్రాచీన చరిత్రను ఎత్తివేయడమే సమంజసమని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులను తీసివేయాలనే ప్రతిపాదన రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మొఘల్ సామ్రాజ్యం, గాందీజీ హత్య, ప్రజాస్వామ్యం–రాజకీయ పారీ్టలు అనే చాప్టర్స్‌ను ఎన్సీఈఆర్టీ అనవసరమైనవిగా చెబుతోంది. పాత చరిత్రలో విజయాలకన్నా, అపజయాల గురించే ఎక్కువగా ఉందనేది ఎన్సీఈఆర్టీ అభిప్రాయం. అయితే ఇవి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికీ బోధనాంశాలుగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల్లోనూ వీటిలోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎడ్‌సెట్, లాసెట్, గ్రూప్స్, వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఆర్ట్స్’ విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళకు ఈ చాప్టర్లు చదివే వీలుండదు. దాంతో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు నష్టం కల్గించే వీలుందని నిపుణులు అంటున్నారు. సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్ధులకు... సైన్స్‌లో డార్విన్ సిద్ధాంతాన్ని కేంద్ర విద్యా సంస్థ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. మానవ పరిణామ క్రమాన్ని సహేతుకంగా నిరూపించే సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ కమిటీ విభేదించినట్టు తెలుస్తోంది. దీంతో పాటే పైథాగరస్ సిద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచి స్తోంది. దీనివల్ల కూడా సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్థులు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలకు హాజరవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు. రాష్ట్ర బోర్డు పరిధిలో ఉండే విద్యార్థులు కొత్త చాప్టర్స్ చదివే వీలుండదు. వాళ్లు చదివిన పురాతన భారత చరిత్ర వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని పలువురు అంటున్నారు. అన్ని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థి విద్యా విధానంలోనే స్కిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా పాఠ్యాంశాలు ఉండటం మంచిది. అయితే, మార్పు జరిగేటప్పుడు రాష్ట్రాల పరిధిలోని విద్యా విధానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. లేనిపక్షంలో అనేక మంది విద్యార్థులు రెండు సిలబస్‌లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) వక్రీకరణ సరికాదు చరిత్రను వక్రీకరించే విధానం ఎన్సీఈఆర్టీ సిఫార్సుల్లో బోధపడుతోంది. ప్రాచీన చరిత్రను తీసివేయాలనే ధోరణి మంచిది కాదు. చరిత్ర తెలుసుకుంటేనే ప్రతిభ పెరుగుతుంది. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా చరిత్రను పాఠ్యాంశాల్లో జోడిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు సిలబస్‌లు వల్ల కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా.. ట్యాక్స్ రూల్స్ తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలో వేతనాలు పొందే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ నిధి. ఇందులో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను జమ చేస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటాయి. ఇలా పోగైన మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత, వడ్డీతో పాటు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇతర ఆదాయాల మాదిరిగానే ఈపీఎఫ్ ఉపసంహరణలు కొన్ని పరిస్థితులలో పన్నుకు లోబడి ఉంటాయి. ఈపీఫ్ విత్‌డ్రా షరతులు ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలోని మొత్తాన్ని సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణకు ఒక సంవత్సరం ముందు అయితే పీఎఫ్ ఖాతాలోని 90 శాతం నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగం విషయంలో అయితే ఉద్యోగం కోల్పోయిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఇతర అవసరాల నిమిత్తం తమ పీఎఫ్ నిధులను ఉపయోగించుకునేందుకు ఈ నియమాలు సౌలభ్యాన్ని అందిస్తాయి. పన్నులేమైనా ఉంటాయా? ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై సాధారణంగా ఎలాంటి పన్ను ఉండదు. అయితే, మునుపటి సంవత్సరాల్లో జమ చేసిన మొత్తాలపై సెక్షన్ 80C కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 80C గతంలో క్లెయిమ్ చేయకుంటే అదనపు పన్ను వర్తించవచ్చు. ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తవ్వని ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకుంటే మూలం వద్ద పన్ను (TDS) మినహాయిస్తారు. అదే ఉపసంహరణ మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు. ఇక ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత చేసే ఈపీఎఫ్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఒకటి కంటే కంపెనీల్లో పనిచేసిన సందర్భంలో ఈ ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ఉద్యోగి పూర్వ కంపెనీలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్‌తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్‌తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్‌ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్‌ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్‌లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్‌లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్‌లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్‌లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
మన ఎగుమతులపై అంతర్జాతీయ సవాళ్ల ప్రభావం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, మాంద్యం పరిస్థితుల ప్రభావం భారత ఎగుమతులపై ఉండడం సహజమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో బలహీనత ఉండొచ్చన్నారు. అదే సమయంలో సేవల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్టు అభివర్ణించారు. టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు (ద్రవ్యోల్బణం) ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత మన దేశ ఎగుమతులు అక్టోబర్ నెలకు ప్రతికూల జోన్‌కు వెళ్లడం గమనార్హం. 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జ్యుయలరీ, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీ మేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఫార్మా, మెరైన్, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య లోటు సైతం 26.91 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం 33 శాతం పెరిగి 437 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
పుదుచ్చేరి సీఎంకు మళ్లీ కొత్త చిక్కులు
అధికార పగ్గాలు చేపట్టిన పుదుచ్చేరి సీఎం రంగస్వామి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సభలో బీజేపీ సభ్యుల బలం పెరగడంతో సంకటంలో పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, రెండు మంత్రి పదవుల కోసం బీజేపీ పట్టుబడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్–10, బీజేపీ–6, డీఎంకే–6, కాంగ్రెస్–2, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. బీజేపీ–ఎన్ఆర్ కాంగ్రెస్ కూట మి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆయన కరోనాతో ఆస్పత్రిలో చేరడంతో ఎల్జీ తమిళిసై పరిపాలన చేపట్టా రు. ఆస్పత్రి నుంచి సీఎం రాగానే 23 రోజుల అనంతరం బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ సభ్యులు ఆరుగు రు, నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి అసెంబ్లీలో బీజేపీ బలం తొమ్మిదికి చేరింది. దీనికితోడు ముగ్గు రు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరారు. అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నిర్మల్‌కుమార్, సీనియర్ నేత నమశ్శివాయంతో భేటీ కావడం, ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం చర్చకు దారి తీసింది. బీజేపీ బలం 12కు చేరిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, రెండు మంత్రి పదవుల్ని తమకు కట్టబెట్టాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న దృష్ట్యా డిప్యూటీ సీఎం పదవిని ఇస్తే తనను డమ్మీని చేస్తారని సీఎం రంగస్వామి ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అలాగే తన పార్టీలోనూ ముఖ్య నేతలు పదవుల్ని ఆశిస్తుండంతో సీఎంకు శిరోభారం తప్పడం లేదు. ఈ క్రమంలో సీఎం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవుల విషయంలో బీజేపీ నుంచి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైన పక్షంలో డీఎంకే, తటస్థంగా ఉన్న మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలిసింది. చదవండి: ‘మా వల్లే సంపన్నులై.. మాకే ఓటు వేయరా?’: మంత్రి ఫొటో మోదీది.. బాధ్యత రాష్ట్రాల పైనా? -
హీరాగోల్డ్ కేసులో సెలబ్రిటీలకు చిక్కులు
-
ఆ ప్రొటీన్లతో చిక్కే...!
ఆరోగ్యానికి మాంసాహారం మంచిదా? శాకాహారం మంచిదా? అన్న చర్చ చాలాకాలంగా కొనసాగుతున్నదే. కానీ కాలిఫోర్నియా, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. మాంసపు ప్రొటీన్లు హానికారకమైతే, విత్తనాలు, జీడి, బాదం వంటి పప్పుల నుంచి అందే ప్రొటీన్లు గుండెకు మేలు చేస్తాయని! దాదాపు 81 వేల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్యారీ ఫేజర్ తెలిపారు. పాడి ఉత్పత్తుల ద్వారా అందే కొవ్వు గుండెజబ్బులకు కొంతవరకూ కారణమని ఇప్పటికే తెలిసినప్పటికీ ప్రొటీన్ల పాత్ర ఏమిటన్న విషయంపై స్పష్టత లేని నేపథ్యంలో తాము ఈ అధ్యయనం చేపట్టామని ఆయన చెప్పారు. దీని ప్రకారం మాంసపు ప్రొటీన్లతో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 60 శాతం ఎక్కువగా ఉండగా.. మొక్కల ఆధారిత ప్రొటీన్ల (బాదం, జీడి, విత్తనాలు వంటివి)తో ఇది గణనీయంగా తగ్గుతుందని వివరించారు. మొక్కల లేదా జంతు ఆధారిత ప్రొటీన్లు అనే రెండేస్థూల వర్గాలుగా కాకుండా తాము మరింత స్పష్టమైన ప్రొటీన్ వర్గీకరణ ద్వారా అధ్యయనం చేశామని, తద్వారా తమ ఫలితాలు మరింత కచ్చితమైనవని అంచనా వేస్తున్నట్లు ఫేజర్ తెలిపారు. మాంసపు ప్రొటీన్లలో ఉండే కొన్ని రకాల అమినో యాసిడ్లు గుండెపై చూపే ప్రభావం, బీపీ, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలకు ఏ రకమైన ప్రొటీన్లు కారణమవుతున్నాయి? అన్న అంశాలను తెలుసుకోవాల్సిన అవసరాన్ని తమ అధ్యయనం కల్పించిందని ఫేజర్ వివరించారు. -
పోలీసు రిక్రూట్మెంట్లో ‘స్థానికం’ చిక్కులు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియతో రాజధానిలో ఉన్న రెండు కమిషనరేట్లలో ‘లోకల్ ప్రాబ్లమ్స్’ రానున్నాయి. వీటిని సరిచేస్తూ సవరణ ఉత్తర్వులు ఇవ్వకుంటే పోలీసు ఎంపికలో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. సైబరాబాద్, రాచకొం డ కమిషనరేట్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు వస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభజన ప్రభావం హైదరాబాద్ జిల్లాపై లేకపోవడంతో సిటీ కమిషనరేట్ ‘సేఫ్ జోన్’లో ఉండిపోయింది. యూనిట్ ఆధారంగా ఎంపికలు... పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో భౌగోళిక ప్రాంతాన్ని యూని ట్‌గా పరిగణిస్తూ పోలీసు రిక్రూట్మెంట్ రూల్స్ రూపొందిం చారు. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. ప్రాథమికంగా కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్స్పెక్టర్తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు. గందరగోళంలో రెండు కమిషనరేట్స్... జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ఉత్తర్వులు సైబరాబాద్‌తో పాటు రాచకొండ కమిషనరేట్నూ గందరగోళంలో పడేశాయి. కొత్తగా ఏర్పడనున్న శంషాబాద్ జిల్లాలోకి షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, శేరిలిం గంపల్లి, రాజేంద్రనగర్ వస్తున్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ రాచకొండ కమిషనరేట్‌లో, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రాంతాలు. అలాగే మల్కాజిగిరి జిల్లాలో కి కూకట్పల్లి, కుద్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాలు చేరుతున్నాయి. వీటిలో మొదటి రెండూ సైబరాబాద్‌లో, మిగి లినవి రాచకొండలో భాగాలు. ఇక రాచకొండ కమిషనరేట్‌లో ఉన్న భువనగిరిని యాదాద్రి జిల్లాలోకి చేరుస్తూ అందులోకి వరంగల్, నకిరేకల్, తుంగతుర్తి నుంచి కొన్ని ప్రాంతాలను కలుపుతున్నారు. ఇలా సైబరాబాద్, రాచకొండ క మిషనరేట్ల పరిధిలో భౌగోళికంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు వచ్చేలా విభజన ముసాయిదా ఉంది. దీనివల్ల రిక్రూట్మెంట్లో అనేక న్యాయపరమైనచిక్కులొచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిందే... పోలీసు రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టుల దగ్గరకు వచ్చేసరికి ఆయా రెవెన్యూ జిల్లాలనే పరిధిగా ఎంచుకుంటారు. రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి యూనిట్‌లోనూ కచ్చితంగా 80 శాతం స్థానికుల్ని, 20 శాతానికి మించకుండా స్థానికేతరుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర జిల్లాల్లో విభజన వల్ల ఇబ్బందు లు లేకపోయినా సైబరాబాద్, రాచకొండలకు చిక్కులు వస్తున్నాయి. ఈ రెండింటి పరిధిలోనూ ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ జరిగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎవరిని స్థానికులుగా పరిగణించాలి అనేది ప్రశ్నగా మారుతోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా సవరణ ఉత్తర్వులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో సైబరాబాద్, రాచకొండల వరకు పోలీసు జిల్లానే యూనిట్‌గా తీసుకునేలా ఆదేశాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు.