Considerations
-
పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా.. ట్యాక్స్ రూల్స్ తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలో వేతనాలు పొందే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ నిధి. ఇందులో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను జమ చేస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటాయి. ఇలా పోగైన మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత, వడ్డీతో పాటు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇతర ఆదాయాల మాదిరిగానే ఈపీఎఫ్ ఉపసంహరణలు కొన్ని పరిస్థితులలో పన్నుకు లోబడి ఉంటాయి. ఈపీఫ్ విత్‌డ్రా షరతులు ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలోని మొత్తాన్ని సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణకు ఒక సంవత్సరం ముందు అయితే పీఎఫ్ ఖాతాలోని 90 శాతం నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగం విషయంలో అయితే ఉద్యోగం కోల్పోయిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఇతర అవసరాల నిమిత్తం తమ పీఎఫ్ నిధులను ఉపయోగించుకునేందుకు ఈ నియమాలు సౌలభ్యాన్ని అందిస్తాయి. పన్నులేమైనా ఉంటాయా? ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై సాధారణంగా ఎలాంటి పన్ను ఉండదు. అయితే, మునుపటి సంవత్సరాల్లో జమ చేసిన మొత్తాలపై సెక్షన్ 80C కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 80C గతంలో క్లెయిమ్ చేయకుంటే అదనపు పన్ను వర్తించవచ్చు. ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తవ్వని ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకుంటే మూలం వద్ద పన్ను (TDS) మినహాయిస్తారు. అదే ఉపసంహరణ మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు. ఇక ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత చేసే ఈపీఎఫ్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఒకటి కంటే కంపెనీల్లో పనిచేసిన సందర్భంలో ఈ ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ఉద్యోగి పూర్వ కంపెనీలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. -
రబీకి సన్నద్ధం
88 వేల క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు సీజన్ ప్రారంభం కాగానే పంపిణీ త్వరలో రూ.197.97కోట్ల ఇన్పుట్ సబ్సిడీ భారీ వర్షాలకు 41,826 హెక్టార్లలో పంట నష్టం జేడీఏ మాధవి శ్రీలత నారాయణఖేడ్: రబీ సీజన్‌కు శాఖాపరంగా సన్నద్ధమైనట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంచాలకులు మాధవి శ్రీలత తెలిపారు. గురువారం ఆమె నారాయణఖేడ్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 88 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని, అవి త్వరలో రానున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా 25 వేల క్వింటాళ్ల శనగ, 8 వేల క్వింటాళ్ల మొక్కజొన్న, 25 వేల క్వింటాళ్ల మినుము, 1,100 క్వింటాళ్ల జొన్న, 2 వేల క్వింటాళ్ల పెసర, 25 వేల క్వింటాళ్ల వరి, 2 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ప్రతిపాదించినట్టు తెలిపారు. 30 శాతం సబ్సిడీపై విత్తనాలు ఈ విత్తనాలను 30శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తామని జేడీ తెలిపారు. రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. 1.39 లక్షల హెక్టార్ల మేర సాగు కావాల్సి ఉంగా మరో 40 వేల హెక్టార్లు అదనంగా సాగయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. రబీ సీజన్ ప్రారంభం కాగానే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుతామని, ప్రస్తుతం భూమిలో తేమ తగ్గాల్సి ఉందన్నారు. ఖరీఫ్‌లో పంటలకు దెబ్బ భారీ వర్షాల కారణంగా జిల్లాలో వివిధ రకాల పంటలు 41,826 హెక్టార్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు జేడీ తెలిపారు. వరి 4,902 హెక్టార్లు, మొక్కజొన్న 1,539, జొన్న 377, పత్తి 16,827, చెరకు 251, కంది 2,587, పెసర 12, మినుము 742, సోయా 14,588 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు ఆమె పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా సోయా పంటకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. వరి పొలాల్లో ఇసుక మేటలతో దెబ్బతిందని, మొక్కజొన్న కంకులు కోశాక తడిసి మొలకలు వచ్చాయన్నారు. కందికి ఎక్కువగా నష్టం జరగలేదన్నారు. పంటనష్టాలపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నామని, నివేదిక రాగానే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. చిన్నశంకరంపేటలో అత్యధిక వర్షం జిల్లాలో అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో వర్షపాతం నమోదైందని జేడీ తెలిపారు. మండలంలో 779 మి.మీ సాధారణం కాగా 1,362 మి.మీ. కురిసిందన్నారు. జిల్లాలోని రైతులకు త్వరలో ఇన్పుట్ సబ్సిడీ రానుందన్నారు. రూ.197.97 కోట్లు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో అత్యధికంగా వర్షపాతం సెప్టెంబర్‌లో నమోదైందని, ఆగస్టులో లోటు ఉందన్నారు. విలేకరుల సమావేశంలో అగ్రోస్ ఆర్ఎం వెంకన్న పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్లు మరికొన్ని...
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే రెండు విడతలుగా 4,986 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ. 426.10 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ 31 బస్తీల్లో మరో 14,979 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికి అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా ఈనెల 17న జరుగనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సంవత్సరం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఇంటి నిర్మాణ ఖర్చుకు సంబంధించి పలు తర్జనభర్జనలు, చర్చల అనంతరం జీ + 3 పద్ధతిలో నిర్మించేవాటికి రూ. 7 లక్షలు, స్టిల్ట్ + 5 అంతస్తుల్లో నిర్మించేవాటికి రూ. 7.75 లక్షలు, సెల్లార్ +స్టిల్ట్+9 అంతస్తుల్లో నిర్మించేవాటికి రూ. 7.90 లక్షలకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇందులో ప్రతి ఇంటికి రూ. 7 లక్షల వంతున (కేంద్రం సబ్సిడీతో కలిపి) రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మిగతా నిధుల్ని జీహెచ్ఎంసీ నుంచే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గాను ఖాలీస్థలాలను సర్వే చేసిన అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో 31 ప్రాంతాల్లో 14,979 ఇళ్లను నిర్మించవచ్చునని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకుగాను దాదాపు రూ. 1257 కోట్లు ఖర్చు కానుండగా, రూ.1160 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇవాల్సి ఉంది. దాదాపు రూ. 96 కోట్లను జీహెచ్ఎంసీ నుంచి వెచ్చించాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలకు ఒక్కో ఇంటికి రూ. 75 వేల వంతున రాష్ట్రప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఎంపిక చేసిన బస్తీలు.. 1.గోడేకి ఖబర్(గోషామహల్) 2.ఇందిరానగర్(ఖైరతాబాద్) 3.అంబేద్కర్ నగర్ రోడ్‌నెంబర్.46(ఖైరతాబాద్) 4.రామకృష్ణానగర్(ఖైరతాబాద్) 5.చాచానెహ్రూనగర్(సనత్‌నగర్) 6. అమీర్‌పేట(సనత్‌నగర్) 7.పొట్టిశ్రీరాములు నగర్(సనత్‌నగర్) 8.అంబేద్కర్‌నగర్,రామ్‌గోపాల్‌పేట(సన™Œ నగర్) 9. సారథినగర్(జూబ్లీహిల్స్) 10.కమలానగర్(జూబ్లీహిల్స్) 11. జోషివాడ(నాంపల్లి) 12.సుభాష్‌చంద్రబోస్‌నగర్ (సికింద్రాబాద్) 13.సాయిచరణ్‌కాలనీ(ముషీరాబాద్) 14.లక్ష్మీదాస్బాగ్ (నాంపల్లి) 15 కామ్గారి నగర్(అంబర్‌పేట) 16.కిడికీబూద్అలీటా(మలక్‌పేట) 17.గాంధీనగర్(కంటోన్మెంట్) 18.శ్రీరామ్‌నగర్(కంటోన్మెంట్) 19.అంబేద్కర్‌నగర్(కంటోన్మెంట్) 20.బండ్లగూడ (చాంద్రాయణగుట్ట) 21. మైలార్‌దేవ్‌పల్లి(రాజేంద్రనగర్) 22. రామకృష్ణహట్స్, బతుకమ్మకుంట(అంబర్‌పేట) 23.బాగ్ హయత్‌నగర్(ఎల్బీనగర్) 24.బంజారాకాలనీ (ఎల్బీనగర్) 25.అహ్మద్‌గూడ (కీసర) 26.చైతన్యనగర్ (ఉప్పల్) 27.బహదూర్‌పల్లి(కుత్బుల్లాపూర్) 28.బైరాగిగూడ (రాజేంద్రనగర్) 29.బుద్వేల్(రాజేంద్రనగర్) 30.నల్లగండ్ల(శేరిలింగంపల్లి) 31. కైత్లాపూర్(కూకట్పల్లి). -
కూత పెట్టేనా?
సింగిల్ లైన్‌తో ప్రయాణికుల అవస్థలు... క్రాసింగ్ వస్తే గంటల తరబడి వెయిటింగ్... ప్రతి బడ్జెట్లో అరకొర నిధుల కేటాయింపు... ఊరిస్తున్న మాచర్ల-గద్వాల రైల్వే లైన్... ఇదీ పాలమూరు జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి. దశాబ్దాకాలంగా రైల్వే బడ్జెట్లో జిల్లా అన్యాయానికి గురవుతోంది. గత పాలకుల నిర్లక్ష్యం, జిల్లా ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా కొత్త ప్రాజెక్టులే కాదు కనీసం నిధులు కూడా రావడం లేదు. జిల్లాలో రైల్వే స్టేషన్లు సమస్యల నిలయంగా మారాయి. కొత్త రైళ్ల రాక, రైళ్ల పొడిగింపు, బ్రిడ్జిల నిర్మాణం కలగా మారింది. ఈసారైనా మన ఎంపీలు రైల్వే బోర్డుకు పంపిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్నారా? లేదా బుట్టదాఖలయ్యాయా?.. ఈ విషయం నేడు కేంద్రమంత్రి సదానందగౌడ ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌తో తేలనుంది. నేడు రైల్వే బడ్జెట్ * సదానందా...కరుణ చూపేనా? * నిర్లక్ష్యానికి గురవుతున్న పాలమూరు రైల్వే ప్రాజెక్టులు * ముందుకు సాగని ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు * నడిగడ్డ రైల్వే ప్రతిపాదనలకు మోక్షం లభించేనా? * గద్వాల- మాచర్ల నూతన లైన్‌కు మంజూరు ఎప్పుడో? ముందుకు సాగని డబ్లింగ్ పనులు... ఫలక్నామా-మహబూబ్‌నగర్ డబ్లింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ లైన్ కేవలం సర్వేలకే పరిమితమవుతోంది. ప్రతి బడ్జెట్లో డబ్లింగ్ లైన్‌కు నిధులు కేటాయించడంలో వివక్ష కొనసాగుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ 1996-97లో మంజూరైన మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైల్వే లైన్ పనులు మాత్రమే చురుగ్గా సాగుతున్నాయి. అదికూడా కర్ణాటక రాష్ట్ర ప్రతినిధుల చొరవ వల్లే పనులు జరుగుతున్నాయి. జిల్లా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతోనే ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ డబుల్ రైల్వేలైన్ వెనక్కి పోతోంది. స్టేషన్ల అభివృద్ధిపై కనిపించని కరుణ మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ స్టేషన్ల అభివృద్ధికి గత బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు. మహబూబ్‌నగర్, గద్వాల రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచినా జరిగిన పనులు ఏమిలేవు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జిల్లా రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా మార్చాలనే డిమాండ్ ఉంది. ఇక రద్దీవేళల్లో మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ స్టేషన్లలో టికెట్లు తీసుకోవడానికి కూడా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్-గుత్తి డబుల్‌లైన్‌కు మోక్షం కలిగేనా... గద్వాల-రాయచూర్‌ల మధ్య మరిన్ని రైళ్లు పెరుగుతాయన్న ఆశ రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉంది. గత ఫిబ్రవరి 12న ప్ర వేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో అప్పటి కర్నూలు ఎంపీ సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉండటంతో కేవలం కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ రైలు మాత్రమే మంజూరై ప్రారంభమైంది. మిగతా పెండింగ్ సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. 2013-14 బడ్జెట్లో మహబూబ్‌నగర్ -గుత్తి వరకు డబుల్ ట్రాక్ నిర్మాణానికి సర్వే అనుమతి ఇచ్చారు. ఇప్పటికే డబుల్‌లైన్‌కు సంబంధించిన సర్వేలను అధికారులు పూర్తి చేసి రైల్వే శాఖకు పంపించారు. ఈసారి ట్రాక్ నిర్మాణానికి అ నుమతి లభిస్తుందనే ఆశతో ఆ ప్రాంత వాసులు ఉన్నారు. వీటికి స్థానం దక్కేనా! పేద, మధ్య తరగతి రథంగా పేరొందిన రైలు బండి కూత వినేందుకు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రాయచూరు నుంచి వయా గద్వాల మీదుగా మా చర్ల దాకా రైల్వే లైన్ పూర్తి అయితే ప్రజల ఆశలు నెరవేరుతాయి. మొదటిదశలో భాగంగా రాయచూరు నుంచి గద్వాల వరకు దాదాపు 59 కిలోమీటర్ల దూరం గల రైల్వే లైన్ పూర్తిచేయడానికే సరిగ్గా పుష్కరకాలం పట్టింది. మిగతా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీ దుగా మాచర్ల దాకా వేయాల్సిన రైలు లైన్‌కు సంబంధించి దశాబ్ద కాలంగా కేవలం ప్రతి పాదనలకు మాత్రమే పరిమితమవుతున్నా యి. గతేడాది కూడా వీటిపై ప్రతిపాదనలు పంపినా ఈప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. గత అక్టోబర్‌లో ప్రారంభమైన గద్వాల- రాయచూరు నూతన బ్రాడ్‌గేజ్ లైన్లో ప్రస్తుతం ఒక్క డెమో రైలు మాత్రమే ప్రయాణికులకు సేవలు అందిస్తోం ది. ఈ లైన్లో కొత్త రైళ్లను ప్రవేశ పెడితే రాయచూరు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య మరింతగా రైల్వే రవాణా సౌకర్యం పెరుగుతుంది. ద్రోణాచలం నుంచి వయా గద్వాల మీదుగా రాయచూరు ద్వారా ముంఠియి వరకు ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడతామని గతంలో హామీ ఉన్నా ఇప్పటి వరకు మోక్షం లేదు. గద్వాల జంక్షన్‌గా అభివృద్ధి చెందినందున గద్వాల మీదుగా వెళ్తున్న దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్‌లు గోర ఖ్‌పూర్, కోర్బా, ఇండోర్ తదితర ఎక్స్‌ప్రెస్‌లను గద్వాలలో ఒక నిమిషం ఆపాలని ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. గద్వాల రైల్వే జంక్షన్ వద్ద దాదాపు 110 ఎకరాల స్థలం ఉన్నందున, రైల్వే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర రైల్వేమంత్రి ఆమోదం తెలిపితే ఈ ప్రాంత రైల్వేల అభివృద్ధి మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతేడాది పంపిన ప్రతిపాదనలు * చెన్నై, ముంబాయి మెట్రో నగరాలకు అతి తక్కువ మార్గంలో కలిపే రాయచూర్-గద్వాల మధ్య రైల్వే ట్రాక్ అంతా సిద్ధమైంది. కానీ రైళ్ల రాకపోకలు జరగడం లేదు. గద్వాల మీదుగా చెన్నై-షిర్డి మధ్య రైళ్ల రాకపోకలు సాగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. * గద్వాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న 110 ఎకరాల స్థలంలో రైల్వే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటీ ఆచరణలోకి రావడం లేదు. * జిల్లాలో రైల్వే లైన్ సింగిల్ కావడంతో రైళ్ల రద్దీ కారణంగా తరచూ క్రాసింగ్ ఏర్పడుతోంది. రైల్వే లైన్ డబ్లింగ్ చేయాలి. * వాణిజ్య కేంద్రమైన జడ్చర్లలో గూడ్స్ రైళ్ల కారణంగా తరచూ రైల్ గేట్ పడటంతో వాహనాల రాకపోకలకు అటంకాలు ఏర్పడుతున్నాయి. దీని పరిష్కారం కోసం వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించాలి. ఎంపీ జితేందర్‌రెడ్డి రైల్వే బోర్డు ముందు ఉంచిన ప్రతిపాదనలు * ఉందానగర్ (శంషాబాద్)- డోన్ డబ్లింగ్ లైన్ ఏర్పాటు * మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ వయా మక్తల్-మునీరాబాద్ లైన్ * జడ్చర్ల నుంచి నంద్యాల వయా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ రైల్వేలైన్ * గద్వాల-మాచర్ల వయా నాగర్‌కర్నూల్, దేవరకొండ కొత్త రైల్వే లైన్ * ఫలక్నామా దాకా ఉన్న ఎలక్ట్రికల్ లైన్‌ను మహబూబ్‌నగర్ వరకు పొడగించాలి * జడ్చర్లలో ఆర్వోబీ నిర్మాణం * రైల్వే ట్రాక్‌లను బలోపేతం చేయాలి