‘డబుల్’ ఇళ్లు మరికొన్ని...
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే రెండు విడతలుగా 4,986 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ. 426.10 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ 31 బస్తీల్లో మరో 14,979 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికి అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా ఈనెల 17న జరుగనున్న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సంవత్సరం లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఇంటి నిర్మాణ ఖర్చుకు సంబంధించి పలు తర్జనభర్జనలు, చర్చల అనంతరం జీ + 3 పద్ధతిలో నిర్మించేవాటికి రూ. 7 లక్షలు, స్టిల్ట్ + 5 అంతస్తుల్లో నిర్మించేవాటికి రూ. 7.75 లక్షలు, సెల్లార్ +స్టిల్ట్+9 అంతస్తుల్లో నిర్మించేవాటికి రూ. 7.90 లక్షలకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇందులో ప్రతి ఇంటికి రూ. 7 లక్షల వంతున (కేంద్రం సబ్సిడీతో కలిపి) రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మిగతా నిధుల్ని జీహెచ్‌ఎంసీ నుంచే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి గాను ఖాలీస్థలాలను సర్వే చేసిన అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో 31 ప్రాంతాల్లో 14,979 ఇళ్లను నిర్మించవచ్చునని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకుగాను దాదాపు రూ. 1257 కోట్లు ఖర్చు కానుండగా, రూ.1160 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇవాల్సి ఉంది. దాదాపు రూ. 96 కోట్లను జీహెచ్‌ఎంసీ నుంచి వెచ్చించాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలకు ఒక్కో ఇంటికి రూ. 75 వేల వంతున రాష్ట్రప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది.
ఎంపిక చేసిన బస్తీలు..
1.గోడేకి ఖబర్(గోషామహల్) 2.ఇందిరానగర్(ఖైరతాబాద్) 3.అంబేద్కర్ నగర్ రోడ్‌నెంబర్.46(ఖైరతాబాద్) 4.రామకృష్ణానగర్(ఖైరతాబాద్) 5.చాచానెహ్రూనగర్(సనత్‌నగర్) 6. అమీర్‌పేట(సనత్‌నగర్) 7.పొట్టిశ్రీరాములు నగర్(సనత్‌నగర్) 8.అంబేద్కర్‌నగర్,రామ్‌గోపాల్‌పేట(సన™Œ నగర్) 9. సారథినగర్(జూబ్లీహిల్స్) 10.కమలానగర్(జూబ్లీహిల్స్) 11. జోషివాడ(నాంపల్లి) 12.సుభాష్‌చంద్రబోస్‌నగర్ (సికింద్రాబాద్) 13.సాయిచరణ్‌కాలనీ(ముషీరాబాద్) 14.లక్ష్మీదాస్‌బాగ్ (నాంపల్లి) 15 కామ్‌గారి నగర్(అంబర్‌పేట) 16.కిడికీబూద్‌అలీటా(మలక్‌పేట) 17.గాంధీనగర్(కంటోన్మెంట్) 18.శ్రీరామ్‌నగర్(కంటోన్మెంట్) 19.అంబేద్కర్‌నగర్(కంటోన్మెంట్) 20.బండ్లగూడ (చాంద్రాయణగుట్ట) 21. మైలార్‌దేవ్‌పల్లి(రాజేంద్రనగర్) 22. రామకృష్ణహట్స్, బతుకమ్మకుంట(అంబర్‌పేట) 23.బాగ్ హయత్‌నగర్(ఎల్‌బీనగర్) 24.బంజారాకాలనీ (ఎల్‌బీనగర్) 25.అహ్మద్‌గూడ (కీసర) 26.చైతన్యనగర్ (ఉప్పల్) 27.బహదూర్‌పల్లి(కుత్బుల్లాపూర్) 28.బైరాగిగూడ (రాజేంద్రనగర్) 29.బుద్వేల్(రాజేంద్రనగర్) 30.నల్లగండ్ల(శేరిలింగంపల్లి) 31. కైత్లాపూర్(కూకట్‌పల్లి).