ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో సభ్యలు మరింత మంది పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈపీఎఫ్‌వో అక్టోబర్‌లో 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరికను నమోదు చేసింది. 2024 అక్టోబర్‌లో కొత్తగా దాదాపు 7.50 లక్షల మంది సభ్యులు చేరారు.
పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగి ప్రయోజనాలపై పెరిగిన అవగాహన, ఈపీఎఫ్‌వో విజయవంతమైన ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు ఈ కొత్త సభ్యత్వాల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. 2024 అక్టోబరులో జోడించిన మొత్తం కొత్త సభ్యులలో 58.49% మంది 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారే కావడం గమనార్హం. వీరు 5.43 లక్షల మంది ఉన్నారు.
ఇక దాదాపు 12.90 లక్షల మంది సభ్యులు తిరిగి ఈపీఎఫ్‌వోలో చేరారని పేరోల్ డేటా వెల్లడిస్తోంది. ఇది 2023 అక్టోబర్‌తో పోలిస్తే 16.23% అధికం. కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది అక్టోబరుతో పోల్చితే 2.12% ఎక్కువ. రాష్ట్రాలవారీగా చూస్తే నికర సభ్యులలో 22.18% జోడించి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు అక్టోబర్ నెలలో మొత్తం నికర సభ్యులలో 5% కంటే ఎక్కువ వాటాను అందించాయి.
పరిశ్రమల వారీగా నెలవారీ డేటాను పరిశీలిస్తే.. రోడ్డు మోటారు రవాణా, ప్రైవేట్ రంగ ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వంటి పరిశ్రమలలో సభ్యత్వంలో గణనీయమైన వృద్ధిని చూపింది. మాన్‌పవర్ సప్లయర్‌లు, కాంట్రాక్టర్‌లు, భద్రతా సేవలుచ ఇతర కార్యకలాపాలను కలిగి ఉన్న నిపుణుల సేవలు, జోడించిన మొత్తం నికర సభ్యత్వంలో 42.29% వాటాను కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment