స్మార్ట్‌ఫోన్‌నుపరుగెత్తించండి! | smart phone! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌నుపరుగెత్తించండి!

Published Thu, Feb 13 2014 12:10 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్‌నుపరుగెత్తించండి! - Sakshi

స్మార్ట్‌ఫోన్‌నుపరుగెత్తించండి!

మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నత్తనడకన నడుస్తోందా?
 అప్లికేషన్లు మార్చేందుకు, హోమ్‌స్క్రీన్ వేగంగా వచ్చేందుకు మొరాయిస్తోందా?
 తాజా ఓ.ఎస్ ఉన్నా, ప్రాసెసర్ వేగం బాగున్నా అదే తీరా?
 అయితే మీ గాడ్జెట్‌ను గాడిలో  పెట్టాల్సిన సమయం వచ్చేసింది.
 ఇంకెందుకు ఆలస్యం..
 ఈ ఐదు చిట్కాలతో వాటిని స్పీడప్‌చేసేయండి!

 
 బరువు దించుకోండి...

అప్లికేషన్ల సంఖ్య పెరిగిన కొద్దీ స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్‌ల వేగంలో తేడాలొచ్చేస్తాయి. మ్యూజిక్, ఫొటో, వీడియోలతో మెమరీ నింపేసే వారికైతే ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువ. అందుకే అసలు వాడని.. అవసరం లేవనుకున్న అప్లికేషన్లను తొలగించండి... లేదంటే డిజేబుల్ అయినా చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్స్‌మెనూను తెరిచి తొలగించాల్సిన అప్లికేషన్‌ను ఎంచుకుంటే సరి! కష్టపడి డౌన్‌లోడ్ చేసుకున్న వాటిని తొలగించడం ఇష్టం లేకపోతే గూగుల్‌డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజీ సర్వీసుల్లోనైనా భద్రపరచుకోండి. మీ స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్‌లో ఎస్‌డీకార్డు సౌకర్యముంటే... అప్లికేషన్లను దాంట్లోకి మార్చుకున్నా సరిపోతుంది. ఇంకో విషయం... ఫోన్‌తోపాటు వచ్చే అప్లికేషన్లు కొన్ని అన్‌ఇన్‌స్టాల్ కావు. వాటిని డిజేబుల్ చేయడం ఉత్తమం.
 
 లైవ్ వాల్‌పేపర్లను నియంత్రించండి

 లైవ్ వాల్‌పేపర్లు, విడ్జెట్‌లతోనూ బ్యాటరీ మందగిస్తుంది. సామర్థ్యం దెబ్బతింటుంది. డేటా ఎక్కువగా వాడుకునే ఫేస్‌బుక్ వంటివాటితో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. తొలగించాలనుకునే విడ్జెట్‌ను కొద్దిసేపు నొక్కి ఉంచి స్క్రీన్‌పైభాగంలోకి నెట్టేస్తే అది తొలగిపోతుందన్న విషయం తెలిసిందే. లైవ్ వాల్‌పేపర్లను కూడా ఇదేలా నియంత్రించుకోవచ్చు.
 
 కాషేతోనూ ఇబ్బందే...

 కంప్యూటర్ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్లలోనూ సమయంతోపాటు క్యాషే మెమరీ పేరుకుపోతూంటుంది. దీని ప్రభావం గాడ్జెట్ పనితీరుపై పడుతుంది. ఆప్స్‌మెనూకి వెళ్లి క్యాషే ఒక్కోదాన్ని తొలగించుకోవచ్చు. లేదంటే ఆప్ క్యాషే క్లీనర్, క్లీన్‌మాస్టర్ వంటి ఫ్రీ అప్లికేషన్లతోనూ ఈ పనిచేయవచ్చు.
 
 సాఫ్ట్‌వేర్లు అప్‌డేట్ చేసుకోండి...

 ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్ మరింత స్మార్ట్‌గా పనిచేసేలా చేయవచ్చు. ఈ అప్‌డేట్ల ద్వారా సెక్యూరిటీలోపాలను అధిగమించవచ్చు. ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ అప్‌డేట్స్ బటన్‌ను నొక్కితే తాజా అప్‌డేట్లు డౌన్‌లోడ్ అవుతాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement