మార్పిడికి మంగళమేనా? | Currency exchange canceled | Sakshi
Sakshi News home page

మార్పిడికి మంగళమేనా?

Published Mon, Nov 21 2016 1:00 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

మార్పిడికి మంగళమేనా? - Sakshi

మార్పిడికి మంగళమేనా?

రేపో మాపో ప్రకటన  వెలువడే అవకాశం
సీఎం అత్యవసర వీడియోకాన్ఫరెన్‌‌స
నోటు కష్టాలు, చేపట్టాల్సిన చర్యలపైనే చర్చ
10 ఏటీఎం కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
నేడు జిల్లాకు రానున్న రూ.వంద నోట్లు

నగదు మార్పిడి రద్దుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రేపోమాపో ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నారుు. పాత పెద్దనోట్ల మార్పిడికి 12రోజులుగా ఆపసోపాలు పడుతున్న సామా న్య జనం మున్ముందు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోనున్నారు. నగదు మార్పిడి రద్దరుుతే ఎదురయ్యే ఇబ్బందులు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కలెక్టర్లు, బ్యాంక్ అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.     

తిరుపతి (అలిపిరి): పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లా ప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 593 బ్యాంకుల్లో నగదు మార్పిడి కొనసాగినా ప్రజలకు నోటు కష్టా లు తీరడంలేదు. ప్రతి బ్యాంకు ఎదుటా నగదు మార్పిడికి చాంతాడంత క్యూలే కనిపిస్తున్నారుు.  పరిస్థితుల్లో నగదు మార్పిడిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచించడం విమర్శలకు తావి స్తోంది. మరిన్ని కష్టాలు తప్పవేయోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా బ్యాంకు అధికారులూ స్పష్టం చేస్తున్నారు.

చిల్లర కష్టాలు తీరేనా?
నోట్ల మార్పిడి రద్దు ప్రక్రియలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోని పలు శాఖలకు చెందిన ఏటీఎంల్లో సాఫ్ట్‌వేర్ అబ్‌డేట్ చేశారు. జిల్లాలో ఇప్పటికే 10 ఏటీఎంలకు సాఫ్ట్‌వేర్ అబ్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోం ది. సాఫ్ట్‌వేర్ అబ్‌డేట్ చేసిన ఏటీఎం కేంద్రాల నుంచి ప్రజలు రూ.2వేల నోటును డ్రా చేసుకుంటున్నారు. ఆర్బీఐ నుంచి జిల్లాకు సోమవారం రూ.170 కోట్ల మేర వంద నోట్లు రానున్నారుు. చిల్లర నోట్ల కొరత నేపథ్యంలో వంద నోట్లును ఆర్బీఐ అత్యవసరం నిమిత్తం విడుదల చేసింది.

నోటు కష్టాలపైనే చర్చ
పెద్ద నోట్ల మార్పిడి రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ప్రధాన బ్యాంకు శాఖల అధికారులతో ఆదివారం వీడియోకాన్ఫరెన్‌‌స నిర్వహించారు. నగదు మార్పిడి రద్దుచేస్తే ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు.. జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ పంపే వంద నోట్లను ఆయా బ్యాంకు అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సూచించి నట్లు సమాచారం.

కష్టాలు తప్పవు
నగదు మార్పిడి రద్దు చేస్తే సామాన్యులు  ఇబ్బం దులు పడాల్సిందేనని పలువురు నిపుణులు హె చ్చరిస్తున్నారు. కుటుంబంలో యజమానికి తప్ప మిగతా వారికి బ్యాంకు అకౌంట్లు ఉండే అవకాశం చాలా తక్కువ. దీనికి తోడు వారి దగ్గర ఉండే అరకొర నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి డ్రా చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో సులువు కాదు. నగదు మార్పిడి రద్దు చేస్తే దిన కూలీలు, సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement