![Amazon Special Offers On Redmi A1 Smartphone, Full Details Here - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/7/Untitled-2_1.jpg.webp?itok=M-rCvXAa)
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ శుభవార్త మీ కోసమే. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో తన కస్టమర్లకు ఈ అద్భుత ఆఫర్‌ను తీసుకువచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపుని అందిస్తోంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్లన్నీ ఉపయోగిస్తే ఈ మొబైల్ వెయ్యి రూపాయలు లోపు చెల్లించి మన ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం!
రెడ్‌మి ఏ1 స్మార్ట్‌ఫోన్ .. ఇది మరో రకంగా బడ్జెట్ ఫోన్ అని చెప్పవచ్చు. అమెజాన్ వెబ్‌సైట్‌లో దీని ధర రూ. 8,999గా ఉంది. ఈ ధరపై 28 శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో తగ్గింపు పోను రూ. 6,499కే కస్టమర్లు కొనేయచ్చు. అంతేనా ఇది కాకుండా మరో అదిరిపోయే డీల్స్ కూడా ఉన్నాయి, వాటిపై ఓ లుక్కేద్దాం.
ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కింద రూ. 620 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలా మీకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ. 311 నుంచి ప్రారంభం అవుతోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ. 6,100 వరకు ఈ తగ్గింపు ఉంటుంది. ఫైనల్‌గా రూ.1000 లోపే ఈ ఫోన్ మన సొంతం చేసుకోవచ్చు. తమ పాత ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఫోన్ మోడల్, అది ఉన్న కండీషన్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment