
తక్కువ ధరల్లో, అదిరిపోయే ఫీచర్లతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్న షావోమి, తాజాగా సెల్ఫీ ఔత్సాహికుల కోసం ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మి వై1 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్. అంతేకాక ప్రీ-లోడెడ్‌గా షావోమి బ్యూటిఫై 3.0ను ఉంచింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 గా కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ అచ్చం షావోమి ఏ1 స్మార్ట్‌ఫోన్ మాదిరే ఉంది. ఆ ఫోన్‌కున్న మాదిరిగానే మెటల్ బ్యాక్ ప్యానెల్, కర్వ్‌డ్ ఎడ్జ్‌స్ ఉన్నాయి. గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో రెడ్‌మి వై1 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియాలోనే నవంబర్ 8 నుంచి విక్రయానికి రానుంది.
రెడ్‌మి వై1 ఫీచర్లు...
5.5 అంగుళాల డిస్‌ప్లే విత్ హెచ్‌డీ రెజుల్యూషన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
3080 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్
Comments
Please login to add a commentAdd a comment