
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌ను గురువారం లాంచ్ చేసింది. ‘రెడ్‌మి 5ఏ‘ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5999 నుంచి ప్రారంభం కానుంది. 2జీబీ, 3జీబీ రెండు వేరియంట్లలో దీన్నిమార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే భారతీయ కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ చరిత్రలో షావోమి ఇండియా బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. డిస్కౌంట్‌తో తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. తొలి 50లక్షల యూనిట్లకు వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో విక్రయించనుంది. తద్వారా ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనుందట.
రెడ్‌మి 5ఏ (2జీబీ,16జీబీ వేరియంట్)ను రూ.4,999కే అందించనునున్నామని రెడ్‌మి ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్ ప్రారంభం కానుంది. డార్క్ గ్రే, గోల్డ్, రోజ్ గోల్గ్ కలర్ వేరియంట్స్‌లో ఇది లభ్యం.
ఇక లాంచింగ్ ఆఫర్ విషయానికిస్తే రూ.1000 క్యాష్ బ్యాక్‌తోపాటు....దేశ్ కా నెట్‌వర్క్ జియోపై నెలకు రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తున్నట్టు తెలిపింది.
రెడ్‌మి 5ఏ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ తాకే తెర
స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
Xiaomi India has decided to take the biggest step in the history of smartphone industry by giving back INR 500 crores to our community. As a gift to our Mi Fans, Redmi 5A (2GB+16GB) will be priced at INR 4,999 for the first five million units #DeshKaSmartphone pic.twitter.com/Zn04lu3ZQ2
— Redmi India (@RedmiIndia) November 30, 2017