సాక్షి, బెంగళూరు : చైనా మొబైల్ దిగ్గజం షావోమి మరోసారి బడ్జెట్ ధరల ఫోన్లతో భారత మార్కెట్లో సందడి చేస్తోంది. రెడ్‌మి ఏ సిరీస్‌కు కొనసాగింపుగా రెడ్‌మి 8ఏ డ్యూయల్ దేశ్ కా దమ్ దార్ స్మార్ట్‌ఫోన్ అంటూ మంగళవారం లాంచ్ చేసింది. అంతేకాదు మొదటిసారి రెడ్‌మి ఎ సిరీస్‌కు డ్యూయల్ కెమెరాలను జోడించింది. కొత్త "ఆరా ఎక్స్‌గ్రిప్" డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరాలతో, రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ. 6499గా నిర్ణయించింది. దీంతోపాటు రెడ్‌మి 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, 20,000 ఎంఏహెచ్ లను కూడా తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ .799, రూ .1,499 ధరలతో వినియోగదారులకు అందిస్తోంది. వైర్‌లెస్ ఎంఫ్ రేడియో, పవర్ ఫుల్ స్పీకర్స్ ప్రత్యేక ఆకర్షణగా రెడ్‌మి వెల్లడించింది.
ఎంఐ.కామ్, అమెజాన్, ఎంఐ హోమ్స్‌లో ఫిబ్రవరి 18వ తేదీనుంచి వినియోగదారులకు అందుబాటులో వుంటాయి. వినియోగదారులు, అభిమానులు తమ ఉత్పత్తులను తప్పక ఇష్టపడతారని విశ్వసిస్తు న్నామని షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుజ్ శర్మ అన్నారు.
ధరలు
2జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .6,499
3జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ రూ .6,999
రెడ్‌మి 8 ఏ డ్యూయల్ ఫీచర్లు
6.2 అంగుళాల డాట్‌నాచ్ డిస్‌ప్లే
1520x720 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టా-కోర్ చిప్‌సెట్
13+2 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
5000 ఎంఏహచ్ బ్యాటరీ
టైప్-సి పోర్ట్ ద్వారా రివర్స్ ఛార్జింగ్
రెడ్‌మి లాంచ్ చేసిన పవర్‌బ్యాంకులు
Comments
Please login to add a commentAdd a comment